హ్యాపీ బర్త్ డే టు హీరో విక్రాంత్
సంతాన ప్రాప్తిరస్తు సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో విక్రాంత్. ఈ సినిమాలో విక్రాంత్ నటనకు మంచి పేరొచ్చింది. సంతాన ప్రాప్తిరస్తు సినిమా థియేట్రికల్ గా మంచి విజయాన్ని సాధించింది. ఓటీటీల్లోనూ ప్రేక్షకుల ఆదరణ పొందింది. డిస్నీ హాట్ స్టార్, ప్రైమ్ వీడియోలో ఈ సినిమా 200 మిలియన్స్ మినిట్స్ వ్యూస్ దక్కించుకుని కొన్ని వారాల పాటు ట్రెండింగ్ లో నిలిచింది. ఈ సినిమా విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో హీరో విక్రాంత్ ప్రస్తుతం పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. విక్రాంత్ ప్రస్తుతం ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ లో మార్కండేయ అనే డివోషనల్ మిస్టికల్ థ్రిల్లర్…
