Skip to content

హ్యాపీ బర్త్ డే టు హీరో విక్రాంత్

సంతాన ప్రాప్తిరస్తు సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో విక్రాంత్. ఈ సినిమాలో విక్రాంత్ నటనకు మంచి పేరొచ్చింది. సంతాన ప్రాప్తిరస్తు సినిమా థియేట్రికల్ గా మంచి విజయాన్ని సాధించింది. ఓటీటీల్లోనూ ప్రేక్షకుల ఆదరణ పొందింది. డిస్నీ హాట్ స్టార్, ప్రైమ్ వీడియోలో ఈ సినిమా 200 మిలియన్స్ మినిట్స్ వ్యూస్ దక్కించుకుని కొన్ని వారాల పాటు ట్రెండింగ్ లో నిలిచింది. ఈ సినిమా విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో హీరో విక్రాంత్ ప్రస్తుతం పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు.

విక్రాంత్ ప్రస్తుతం ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ లో మార్కండేయ అనే డివోషనల్ మిస్టికల్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. దిల్ రాజు డ్రీమ్స్ సంస్థ తొలి సినిమా హీరో విక్రాంత్ కావడం విశేషం. ఈ సినిమా త్వరలో చిత్రీకరణ జరుపుకోనుంది. మార్కండేయ సినిమా హీరో విక్రాంత్ కు మంచి ఫేమ్ తీసుకురానుంది.

ఈ సినిమాతో పాటు హీరో విక్రాంత్ మధుర శ్రీధర్ రెడ్డి – ప్రొడ్యూసర్ సురేశ్ బాబు కాంబినేషన్ లో ఓ ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు మేకర్స్ వెల్లడించనున్నారు. మార్కండేయ, మధుర శ్రీధర్ రెడ్డి – సురేశ్ బాబు కాంబో మూవీస్ తో ఒక ప్రామిసింగ్ యంగ్ హీరోగా విక్రాంత్ ఎదుగుతాడనే అంచనాలు ఏర్పడుతున్నాయి. విక్రాంత్ హీరోగా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.