Skip to content

“ది మేజ్” నుంచి ‘నన్నే నన్నే..’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా “ది మేజ్”. ఈ మూవీలో ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డాక్టర్ నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో శ్రౌష కమల ఆర్ట్స్, యూఆర్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు. “ది మేజ్” చిత్రాన్ని సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలాయ్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.

తాజాగా ఈ చిత్రం నుంచి హీరో ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ ‘నన్నే నన్నే..’ రిలీజ్ చేశారు. శ్రవణ్ భరద్వాజ్ బ్యూటిపుల్ గా కంపోజ్ చేసిన ఈ పాటకు విజయ్ కుమార్ ప్లెజెంట్ లిరిక్స్ అందించారు. కపిల్ కపిలన్ రిపీటెడ్ గా వినాలనిపించేలా పాడారు. నన్నే నన్నే పాట ఎలా ఉందో చూస్తే..’నా ప్రాణం నీవే, నా ధ్యానం నీవే, నా మౌన గానం ఇకపై నీవే, నా స్నేహం నీవే, నా మోహం నీవే, నా తీరని దాహం ఇకపై నీవే, నా లోకం నీవై మనసిచ్చావే, మాలోకం గాన్నే మహ మెచ్చావే, నా గుడి దేవతవై ఒకటయ్యావే, ఏడడుగుల ప్రేమే ప్రకటించావే,నన్నే నన్నే మనిషిగా గుర్తించావే, నన్నే నన్నే మార్చేశావే, మన్ను, మిన్ను కలిపేలా పైవాడే, నన్నూ నిన్నూ కలిపాడే..’ అంటూ హీరోయిన్ పట్ల హీరో ప్రేమారాధన చూపిస్తూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట.

వాస్తవం–భ్రమ మధ్యనున్న సరిహద్దులను చెరిపేస్తూ, ప్రతి క్షణం మీ ఆలోచనలను సవాలు చేసే, జెయింట్ వీల్ ప్రయాణం లాంటి ఉత్కంఠభరితమైన సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది.

నటీనటులు – శ్రీరామ్ (శ్రీకాంత్), ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు, తదితరులు

టెక్నికల్ టీమ్
——————-

ఆర్ట్ డైరెక్టర్ – రాజు అడ్డాల
ఎడిటర్ – సత్య గిడుతూరి
డీవోపీ – శివ కృష్ణ
మ్యూజిక్ – శ్రావణ్ భరద్వాజ్
సమర్పణ – డాక్టర్ నైమిష రెడ్డి కసిరెడ్డి
బ్యానర్స్ – యూఆర్ క్రియేషన్స్ , శ్రౌష కమల ఆర్ట్స్,
కో ప్రొడ్యూసర్స్ – డాక్టర్ విక్రమ్ సింగిరికొండ, బండ సురేందర్ రెడ్డి, ఎన్. విజయ్ ఎస్ రెడ్డి, కరెడ్డి రఘువంశీ రెడ్డి
ప్రొడ్యూసర్స్ – డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ
స్క్రిప్ట్, డైరెక్షన్ – డాక్టర్ రవికిరణ్ గడలాయ్
పీఆర్ఓ – గాండ్ల శ్రీనివాస్ (జి.ఎస్. మీడియా)

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.