Skip to content

కొల్లేరు సమస్యపై కీలక చర్చలు.. CEC ఛైర్మన్‌తో భేటీ

కొల్లేరు సమస్యపై కీలక చర్చలు.. CEC ఛైర్మన్‌తో భేటీ Telugu News

కొల్లేరుపై సుప్రీం కోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ (CEC) ఛైర్మన్ సీపీ గోయల్ గారిని విజయవాడ ఎయిర్ పోర్టులో కలిసి, ఎయిర్ పోర్టు లాబీలో భేటీ అయ్యి కొల్లేరు సమస్యపై చర్చించడం జరిగింది. లక్షలాది ఆక్వా రైతుల, ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన కొల్లేరు సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరడం జరిగింది. పర్యావరణ పరిరక్షణకు భంగం కలగకుండా, అదే సమయంలో స్థానిక ప్రజల న్యాయసమ్మత హక్కులు, జీవనోపాధి కాపాడేలా కాంటూరు కుదింపు అంశం పరిశీలించి త్వరగా సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించాలని కోరగా CEC ఛైర్మన్ గోయల్ గారు సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరలో నివేదిక సమర్పిస్తామని గోయల్ గారు హమీ ఇవ్వడం జరిగింది.