Skip to content

పరిమళించిన మానవత్వం.. అనారోగ్య బాధిత యువతికి అండగా నిలబడ్డ ఏలూరు ఎంపీ

పరిమళించిన మానవత్వం.. అనారోగ్య బాధిత యువతికి అండగా నిలబడ్డ ఏలూరు ఎంపీ Telugu News

‎.. కొద్ది రోజుల క్రితం ఏలూరు ఎంపీను ఆశ్రయించిన ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తురాలు.
‎.. ఆర్ధిక సాయం చేయటంతో పాటు, వైద్య సహాయం చేస్తానని మాటిచ్చిన ఎంపీ పుట్టా.
‎.. ఇచ్చిన మాట ప్రకారం ఆసుపత్రిలో చేర్పించి ప్రత్యేక ఆహారం అందించే ఏర్పాటు.
‎.. నడవలేని స్థితికి చేరిన యువతికి మూడు రోజుల్లోనే తన సిబ్బందితో వీల్‌ ఛైర్‌ పంపిన ఎంపీ.
‎.. ఏ ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తేవాలని, తాను అండగా ఉంటానని హామీ.
‎.. ఎంపీ మానవతా దృక్పధానికి నెట్టింట్లో వెల్లువెత్తుతున్న ప్రశంసలు.

‎ఏలూరు, మే 18: వివిధ సమస్యలపై తమ వద్దకు వచ్చే ప్రజలకు హామీలు ఇవ్వటం, కొన్ని సందర్భాల్లో ఎంతో కొంత ఆర్ధిక సాయం చేయటం నాయకులకు మామూలే. కానీ ఏలూరు ఎంపీ రూటే సెపరేటు. ఒక గ్రామ సమస్య కావొచ్చు, ఒక వ్యక్తి సమస్య కావొచ్చు.. మొక్కుబడిగా మాటలు చెప్పో, ఏదో కొద్ది డబ్బులు చేతిలో పెట్టి పంపించేయటమో ఆయనకు నచ్చదు. తన దృష్టికి వచ్చిన ఏ సమస్యపైనైనా ఆయన 100 శాతం దృష్టి పెట్టి పరిష్కారం చూపించే వరకూ వదిలిపెట్టరని గత రెండేళ్లుగా అనేక సంఘటనలు రుజువు చేశాయి.  తాజా సంఘటనతో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మరోసారి ప్రజలు ప్రశంసలు అందుకుంటున్నారు.

తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతోన్న నూజివీడు మండలం ‘పొలసానిపల్లి’ గ్రామానికి చెందిన తల్లీ తండ్రి లేని 25 సంవత్సరాల స్వాతి అనే యువతి మూడు రోజుల క్రితం తన పెదనాన్నను తోడుగా తీసుకుని  ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఆయన నివాసంలో కలిసి తన గోడు వెళ్లబోసుకున్న విషయం తెలిసిందే. తీవ్ర ఆయాసంతో,  మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతూ తన సమస్యను చెబుతున్న ఆమె పరిస్థితిని చూసి ఎంపీ చలించి అప్పటికప్పుడు తక్షణ ఆర్థిక సహాయంగా 20 వేల రూపాయలు అందించడమే కాకుండా ఆమెకి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు  చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ వార్తలు కూడా అన్ని మీడియాలలో వచ్చాయి. అయితే ఇతర నేతల్లా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ అంతటితో చేతులు దులుపుకోలేదు. హామీ ఇచ్చిన ప్రకారం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. తన సిబ్బంది ద్వారా అంబులెన్సు పంపి ఆమెను తీసుకొచ్చి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించే ఏర్పాటు చేశారు. అంతేకాదు తన ఆఫీసు సిబ్బంది ద్వారా ఆమెకు ప్రతిరోజూ ప్రత్యేక ఆహారం అందించే ఏర్పాటు చేశారు. హామీ ఇచ్చినట్లుగానే మూడు చక్రాల వాహనాన్ని కూడా కేవలం మూడు రోజుల్లోనే అందించారు. అక్కడితో ఆగకుండా, ఆమె కోలుకునే వరకూ ప్రతి రోజూ వెళ్లి ఆమె యోగ క్షేమాలు తెలుసుకుని చెప్పాలని, ఆమెకు ఏ అవసరం, ఏ ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఆమె కోలుకునే వరకూ అండగా ఉంటానని హామీ ఇచ్చి ధైర్యం చెప్పారు. పేదరికం, ఆరోగ్య సమస్యలతో పోరాడుతూ అలసిపోయిన ఒక దీనురాలిని అక్కున చేర్చుకుని, ఆమెకు అన్ని విధాలా అండదండలు అందిస్తున్న ఎంపీ మానవతకు ఏలూరు పార్లమెంటుతోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.