Skip to content

First Movie Review : \\\’ఫస్ట్ టైం\\\’ మూవీ రివ్యూ

ఫస్ట్ టైమ్ మూవీ రివ్యూ: విజువల్ వండర్‌గా ఆకట్టుకున్న సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ | Rating 3.5/5 Telugu News

హేమంత్ ఆర్ట్స్ పతాకంపై హేమంత్ ఇప్పలపల్లి స్వీయ కథ, దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కిన వినూత్న చిత్రం “ఫస్ట్ టైం”. పరిమిత బడ్జెట్‌తోనే అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిన ఈ చిత్రం, భారతీయ సినీ పరిశ్రమలో భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటిగా నిలుస్తోంది.

ఈ చిత్రంతో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతుండగా, ‘బిగ్ బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ కీలక పాత్రలో నటించారు. హీరోయిన్‌గా అనిక్క విక్రమన్ నటించగా, మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్తా, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి శ్రీ వెంకట్ సంగీతాన్ని అందించగా, వేణు మురళీధర్, రామ్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు. అత్యాధునిక సాంకేతిక విలువలు, వైవిధ్యమైన కథాంశం, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో “ఫస్ట్ టైం” ప్రేక్షకులకు కొత్త సినీ అనుభూతిని అందించనుంది.

 

Tollywood Celebrity Telugu News

కథ విషయానికొస్తే :

2304AD లో ఏలియన్స్ తో ప్రారంభమైన సినిమా అసలు ఈ కలియుగం ఎలా అంతమైంది కొత్త సృష్టి కొత్త భారత ప్రపంచం ఎలా తయారయింది అనే అంశంపై చిత్రీకరించబడింది. ఆ ఏలియన్లకు అప్పుడు సృష్టిలో ఉన్న మానవులు ఈ కలియుగంలో జరిగిన సంఘటనలు గురించి వివరిస్తూ ఒక పవిత్రమైన స్త్రీ కొత్త సృష్టికి ఎలా నాంది పలికింది అనే విషయాన్ని తెలియజేస్తారు. అనిక విక్రమన్ (హీరోయిన్) ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అని తన బావ భూపాల్ రాజు (విలన్), ఎలా అయినా దక్కించుకోవాలని శివకుమార్ రామచంద్రవరపు (విలన్), అఖిల్ సార్థక్ ప్రయత్నిస్తారు. అలాంటి సంఘటన నుంచి అనికా విక్రమన్ ఎలా తప్పించుకుంది? సౌరబ్ ధింగ్ర ను ఎలా కలుసుకుంది? కొత్త సృష్టి కొత్త భారత ప్రపంచం ఎలా తయారయింది? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. శ్రీ వెంకట్ అందించిన సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.

First TIme Movie Review in telugu

నటీనటుల విషయానికొస్తే :

సౌరబ్ ధింగ్ర పరిచయమైన తొలి చిత్రం అయిన మంచి నటనను కనబరిచారు. అనిక విక్రమన్ నటన మరియు అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. భూపాల్ రాజు శివకుమార్ అఖిల్ సార్థక్ ఎవరి పాత్రలో వారు ఒదిగిపోయారు. మైమ్ గోపి, అజయ్ రత్నం, అన్నపూర్ణమ్మ, గాయత్రి గుప్తా పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

టెక్నికల్ ఆస్పెక్ట్స్ :

ఈ ఫస్ట్ టైం మూవీ ని AI ని ఎక్కడ వాడకుండా HI హ్యూమన్ ఇంటలిజెన్స్ తో HI హేమంత్ ఇప్పలపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించే దర్శకత్వం వహించారు. తక్కువ బడ్జెట్ లో హైటెక్నికల్ వాల్యూస్ తో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక న్యూ ఏజ్ సినిమాను అందించారు. గతంలో వి ఎఫ్ ఎక్స్ అనుభవంతో చాలా గ్రాండ్ విజువల్స్ ని అందించారు. వేణు మురళీధర్ మరియు రామ్ సినిమాటోగ్రఫీ పనితీరు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ : నటీనటుల పనితీరు, సంగీతం, గ్రాండ్ విజువల్స్. సెకండ్ హాఫ్ లో ఉత్కంఠభరిత సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్ : ఫస్టాఫ్ కొంచెం కొన్ని సిన్లు లాగ్ అనిపిస్తుంది.

ఫైనల్ వెర్డెక్ట్ : హై టెక్నికల్ వాల్యూస్ ఉన్న న్యూ ఏజ్ సినిమా

రేటింగ్ : 3.75/5.