ZEE5 తెలుగు నుంచి ‘‘మేము కాప్’లం’’ అనే మరో ఒరిజినల్ సిరీస్ వచ్చింది. రా ఎంటర్టైన్మెంట్స్…
చిరంజీవి – బాబీ కొల్లి కాంబో మరోసారి.. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్


మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ‘వాల్తేర్ వీరయ్య’ సంచలనాత్మక మాస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ ద్వయం మరో భారీ ప్రాజెక్ట్ – #చిరుబాబీ2 / #చిరు158 తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కన్నడ, తమిళ, హిందీ భాషల్లో పలు భారీ ప్రాజెక్టులను అందించిన తర్వాత, కేవీఎన్ ప్రొడక్షన్స్ వారి తొలి తెలుగు చిత్రం ఇది.
ఇప్పటికే వరుస అప్డేట్స్‌తో భారీ అంచనాలు సృష్టించిన ఈ చిత్రం నేడు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమం మరింత వైభవంగా మారింది. ఈ మెగా త్రయం వేదికను పంచుకోవడం అభిమానులకు కనులవిందు చేసింది. పవన్ కళ్యాణ్ క్లాప్‌బోర్డ్ కొట్టగా, సుష్మిత కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వి.వి. వినాయక్ ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. బి. గోపాల్, కోదండరామి రెడ్డి, నాగబాబు చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి లోహిత్ తన బృందంతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మాస్ ప్రేక్షకుల అభిరుచిని బాగా అర్థం చేసుకున్న దర్శకుడు బాబీ కొల్లి ఈసారి మరింత భారీ కథను సిద్ధం చేశారు. మ్యాసీవ్ స్కేల్, ఇంటెన్సిటీ తో నిండిన ఈ కథలో చిరంజీవి తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఆయన జిమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో ఈ సినిమా కోసం ఆయన ఎంత అంకితభావంతో సిద్ధమవుతున్నారో స్పష్టం చేసింది.
ఈ చిత్రంలో మలయాళ నటి అనస్వర రాజన్ కీలక పాత్రలో నటించనున్నారు.
#ChiruBobby2 కోసం టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. సంగీత సంచలనం ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ విజువల్స్‌ను అద్భుతంగా ఆవిష్కరించనున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాశ్ కొల్లా, ఎడిటర్‌గా ఆంటోని రూబెన్ పని చేస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి ఎడిషనల్ స్క్రీన్‌ప్లే రైటర్లుగా పనిచేస్తున్నారు. హిలేరియస్ రైటింగ్ తో పొందిన భాను-నందు ద్వయం ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, అనశ్వర రాజన్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బాబీ కొల్లి
నిర్మాత: వెంకట్ కె నారాయణ
బ్యానర్: కెవిఎన్ ప్రొడక్షన్స్
సంగీతం: థమన్ ఎస్
స్క్రీన్ ప్లే రైటర్స్: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
అడిషినల్ స్క్రీన్ ప్లే రైటర్స్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
DOP: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: ఆంటోనీ రూబెన్
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
VFX సూపర్‌వైజర్: యుగంధర్ టి
డైలాగ్స్: భాను-నందు
చీఫ్ కో-డైరెక్టర్లు: బెల్లంకొండ సత్యం, పూసల రాధాకృష్ణ
కో-డైరెక్టర్: వి క్రాంతి చక్రవర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శరణ్య పోట్ల
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
