Skip to content

‘దూరదర్శిని’ ట్రైలర్‌ విడుదల

‘దూరదర్శిని’  ట్రైలర్‌ విడుదల Telugu News
‘దూరదర్శిని’  ట్రైలర్‌ విడుదల Telugu News

సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘దూరదర్శిని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్‌ పతాకంపై జయ శంకర్‌ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

దర్శకుడు మాట్లాడుతూ ” అందరి మనసులను హత్తుకునే సినిమా ఇది. అందరూ పల్లెటూరులో విహారించిన అనుభూతి కలుగుతుంది. అందరికి పాత జ్క్షాపకాలు గుర్తుకుతెస్తుంది. ఈ చిత్రంలో తల్లిదండ్రులకు, యూత్‌కు, సమాజానికి నచ్చే అంశాలు ఉన్నాయి. అందరికి 90వ దశకం రోజులను గుర్తకు తెస్తుంది. అందరూ చిత్రలహరి పోగ్రామ్‌ కోసం వేచి చూసిన రోజులు గుర్తుకు వస్తాయి. ఈ సినిమాలో మంచి ఎమోషన్‌ ఉంది. అందరి హృదయాలను హత్తుకుంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వాళ్ల గోల్డెన్‌ డేస్‌లోకి తీసుకవెళుతుంది. సువిక్షిత్‌కు హీరోగా మంచి పేరును తీసుకొస్తుంది. ప్రముఖ వ్యక్తులు మా సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది. అందరూ మే 15న విడుదలవుతున్న మాసినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ సినిమా పతాక సన్నివేశాలు అందర్ని ఆలోచింపజేస్తాయి. సినిమా చూసిన వచ్చిన తరువాత ఆ ఫీల్‌ మిమ్ములను వదిలివెళ్లదు’ అన్నారు.

హీరో సువిక్షిత్‌ మాట్లాడుతూ ” అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓ పెద్దాయన బిక్షాటన చేస్తూ కనిపించాడు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన లైఫ్‌ స్టోరియే సినిమా ఇది. ఆయన సొంత కొడుకు వల్ల ఆ పెద్దాయన బిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ కథ. యదార్థ సంఘటన చుట్టు అల్లుకున్న కథ ఇది. ఈ సినిమా చూసి ఎడవకుండా ఉన్నా వాళ్ల లైఫ్‌ను నేను సెటిల్‌ చేస్తాను. దూరదర్శిని ఓ జంటను ఎలా కలిపింది అనేది కథ. ఇప్పుడు ఈ కథ గురించి చెబుతున్న నేను ఎమోషన్‌ అవుతాను. ఓ తండ్రికి మానసిక పరిస్థితి ఎందుకు అలా అయ్యింది? కొడుకు వల్ల బిక్షాటన ఎందుకు చేయాల్సిన వచ్చింది? అనేది ఈ చిత్ర కథ. ఈ సినిమా టికెట్‌తో పాటు ఖర్చీఫ్‌ కూడా ఫ్రీగా ఇస్తాం. ఎందుకు ఈ సినిమా చూసి ఎడ్వకుండా ఎవరూ ఉండలేరు’ అన్నారు. లావణ్య రెడ్డి, కిట్టయ్య, తేజ తదితరులు ఈ చిత్రంలో నటించారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.