Skip to content

‘మా ఇంటి బంగారం’ సినిమాకు ఆడియెన్స్‌ను వ‌స్తోన్న రెస్పాన్స్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది : స‌మంత‌

‘మా ఇంటి బంగారం’ సినిమాకు ఆడియెన్స్‌ను వ‌స్తోన్న రెస్పాన్స్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది :  స‌మంత‌ Telugu News

ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 19న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం చిత్ర యూనిట్ థాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో స‌మంత‌, రాజ్ నిడిమోరు, హిమాంక్‌, నందినీ రెడ్డి, శ్రీముఖి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా..

స‌మంత మాట్లాడుతూ ‘‘‘మా ఇంటి బంగారం’ సినిమాకు వ‌స్తోన్న రెస్పాన్స్ చూసిన త‌ర్వాత చాలా సంతోషంగా అనిపించింది. నాకు సింక్ కాలేదు. దీన్నే ప్ర‌తి ఆర్టిస్ట్ కోరుకుంటారు. ప్ర‌తి సినిమాతో బెట‌ర్ కావాలి. పెర్ఫామెన్స్ బెట‌ర్ కావాల‌ని డ్రీమ్‌లాగా భావిస్తారు. ఈవిష‌యంలో నేను చాలా ల‌క్కీగా భావిస్తాను. థియేట‌ర్స్‌లో సినిమాను చూస్తుంటే స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంది. బ‌స్ ఫైట్‌, క్లైమాక్స్ అన్నీ ఒకే రోజులో చేశాం. అంత కంట్రోల్డ్‌గా, వేస్టేజ్ లేకుండా చేశాం. ప్రీ రిలీజ్ ముందే రిక‌వ‌రి కావాల‌ని ప్లానింగ్‌తో ముందుకెళ్లాం. తొలి రోజు ఎన్ని టికెట్స్ సేల్ అవుతాయ‌నే దానిపై క్లారిటీ లేదు. మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత చేసిన సినిమా ఇది. కాబ‌ట్టి మా బ‌డ్జెట్‌ను ప్రీ రిలీజ్ స‌మ‌యంలోనే రిక‌వ‌రీ కావాల‌ని అనుకున్నాం. ఒక స్టార్ హీరోని ఎలా హైప్ చేస్తారో మా టీమ్ న‌న్నుహైప్ చేశారు. రాజ్ గారు ఈరోల్ రాస్తున్నప్పుడు కమ‌ర్షియ‌ల్ ఇంపాక్ట్ ఉండేలా రాశారు. ఈరోజు నాగురించి ఇలా మాట్లాడుతున్నారంటే నా క్యారెక్ట‌ర్‌ను ఎలా డిజైన్ చేశార‌నే కార‌ణం. హీరోయిన్‌గా నేను చాలా సినిమాలు, క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేశాను. అయితే ఏదో ఒక స్టేజ్‌లో రిస్క్ అవ‌స‌రం. లేక‌పోతే.. ఒక‌చోటే ఆగిపోతాం. కెరీర్‌లో చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను. కొంద‌రైతే స‌మంత అయిపోయింద‌ని కూడా రాశారు. హీరోయిన్‌గా ఇక క‌ష్ట‌మ‌ని కూడా అన్నారు. నేను ఆ స‌మ‌యంలో ఏమీ బాధ‌ప‌డ‌లేదు. ఆ స‌మ‌యంలో అది క‌రెక్టేనేమో అనిపించింది. దాన్ని నేను చాలెంజ్‌గా తీసుకుని వ‌చ్చాను. అలాగే ఈ సినిమాకు కూడా నాతో పాటు ఎంటైర్ టీమ్ చాలెంజింగ్‌గా తీసుకుని వ‌ర్క్ చేశాం. సినిమా చూసిన త‌ర్వాత చిరంజీవిగా అప్రిషియేష‌న్స్ మాకు పెద్ద బూస్ట్ ఇచ్చింది. మాతో ఆయ‌న గంట‌పాటు గ‌డిపారు. ఆయ‌న‌కు థాంక్స్‌. కెరీర్ అనేది మన చేతిలో ఉంటుంది. కానీ రిలేష‌న్ అనేది ఇద్ద‌రి వ్య‌క్తుల చేతిలో ఉంటుంది. ఏదైనా చ‌క్క‌గా ముందుకు వెళ్లాలంటే అమ్మాయి త‌న‌పై తాను న‌మ్మ‌కంతో ఉండాలి. ఒకే వ్య‌క్తిపై ఎక్కువ‌గా ఆధార‌ప‌డ‌కూడ‌దని ఇప్ప‌టి అమ్మాయిల‌కు చెబుతాను. సినిమాను ఇంత భారీ స‌క్సెస్ చేసిన ఆడియెన్స్‌కు మ‌నస్ఫూర్తిగా థాంక్స్ చెబుతున్నాను’’ అన్నారు.

డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ ‘‘రాజ్ గారు కథను డిజైన్ చేసినప్పుడే అన్నీ వర్గాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యేలా ఎలిమెంట్స్ ఉండాల‌నే ఆలోచ‌న‌తో చేశారు. స‌మంత‌గారిని సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్‌గా పెట్టుకుని డిజైన్ చేశారు. స‌మంత ఎప్పటికీ స్పెష‌ల్‌.. రాజ్‌గారు యాడ్ కావ‌టం ఇంకా బ‌లమైంది. ఓ బేబి సినిమా త‌ర్వాత స‌మంత‌గారితో నేను చేసిన సినిమా. ఆమెలో కొత్త డైమ‌న్ష‌న్‌ను ఇందులో చూస్తారు. ఇంత‌కు ముందు మీర‌నుకుంటున్న సామ్ కంటే ప‌ది రెట్లు ఎక్కువ‌గా చూస్తార‌ని ముందుగానే చెప్పాను. అదే నిజమైంది. ఆడియెన్స్‌కి థాంక్స్‌’’ అన్నారు.

నిర్మాత రాజ్ నిడిమోరు మాట్లాడుతూ ‘‘మేం హిందీలో ఫ్యామిలీ మ్యాన్, స్త్రీ వంటి సబ్జెక్ట్స్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించాం. అయితే మా ఇంటి బంగారం సినిమాకు వ‌చ్చినంత రెస్పాన్స్ ఎక్క‌డా రాలేదు. మా వాళ్లంతా ఇప్పుడు నిద్ర లేచి.. ఎంత బాగా తీశావురా! అన్నారు. ఈ సినిమా ప్ర‌తి ఇంటి వ‌ర‌కు వెళుతుంది. నాకు ఎప్పుడూ కొత్త సినిమాలు చేయాల‌న్నా.. రిస్క్ తీసుకోవాల్సి వ‌చ్చింది. మేమే ప్రొడ్యూస్ చేయాల్సి వ‌చ్చింది. ఇక్క‌డ కూడా అదే ప్రాబ్ల‌మ్ ఫేస్ చేశాం. హిమాంక్ ఒక్క‌డే నిల‌బ‌డ్డాడు. అయితే ఒక ప‌క్క‌న భ‌యంగానే ఉండింది. ఈ సినిమాను డిజైన్ చేసిప్పుడు కూడా స‌మంత స్కిల్స్ కూడా బ‌య‌ట‌కు రావాల‌ని అనుకున్నాను. ముందు సినిమా చేయ‌టానికి స‌మంత ఒప్పుకోలేదు. కానీ ఈ సినిమా చేయ‌మ‌ని సామ్‌ను అడిగాను. ఈ క‌థ‌ను చెప్ప‌గానే త‌ను ఓకే చెప్పింది. టీమ్ వ‌ర్క్ లాగా పని చేశాం. చాలా డెలికెట్‌గా ప్లాన్ చేసి డిజైన్ చేశాం. దానికి నందినీ బాగా స‌పోర్ట్ చేసింది. స‌మంత కూడా ఆ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉండింది. టీమ్‌లో ప్ర‌తీ ఒక్క‌రూ కావాల్సిదానికంటే ఎక్కువ‌గానే స‌పోర్ట్ చేశారు. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.