ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా…
‘ఆల్ఫా’ ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది – అలియా భట్
యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రాబోతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆల్పా’. ఇండియాలో ఇది వరకెన్నడూ రానట్టుగా అలియా భట్, షర్వారిలతో భారీ బడ్జెట్ యాక్షన్ మూవీని రూపొందించారు. ఆల్ఫా చిత్రం ఆటిట్యూడ్‌కు ఒక వేడుకగా, ప్రతీకగా నిలిచే ఓ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ మూవీ షూటింగ్, అందులోని క్షణాల్ని తాను ఎప్పటికీ మర్చిపోలేను అని అలియా భట్ అన్నారు. .
అలియా భట్ మాట్లాడుతూ..‘‘ఆల్ఫా’ చిత్రానికి పని చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. నేను ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేసిన సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. యాక్షన్, గ్రాండియర్, అడ్వెంచర్‌లతో కూడిన ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉంది. ఇది నేను మునుపెన్నడూ అనుభవించని ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్. షూటింగ్‌లోని ప్రతీ క్షణాన్ని నేను ఎంతో ప్రేమించాను, ఆస్వాధించాను.
‘ఈ చిత్రంలోని కథ ఇద్దరు మహిళ కథా నాయికల చుట్టే తిరుగుతుంది. అదే నాకు ఎక్కువగా నచ్చిన అంశం. ఇలాంటి గొప్ప స్క్రిప్ట్‌లు మనం అరుదుగా చూస్తుంటాం. ఈ ప్రయాణంలో భాగం అవ్వడం నాకెంతో సంతోషానిచ్చింది. ‘ఆల్ఫా’ అనేది ఆటిట్యూడ్‌కి, సెలెబ్రేషన్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇలాంటి ఓ అద్భుతమైన బృందంతో కలిసి పని చేయడం నాకు మరింత ప్రత్యేకంగా అనిపించింది.
మా దర్శకుడు, నటీనటులు, యాక్షన్ టీమ్, తెర వెనుక సిబ్బంది ఇలా అందరం కలిసి ఎంతో కష్టపడి ఉత్సాహంతో పని చేశాం. మా ఉత్సాహం అంతా కూడా తెరపై ప్రతిబింబిస్తుందని ఆశిస్తున్నాను. ప్రతి ఉదయం సెట్‌కు వెళ్లడానికి మనస్ఫూర్తిగా ఎదురుచూసేదాన్ని, చిత్రీకరణలోని ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాను’ అని అన్నారు.
ఆదిత్య చోప్రా నిర్మాణంలో ‘ది రైల్వే మెన్’ ఫేమ్ శివ్ రావైల్ దర్శకత్వం వహించిన ‘ఆల్ఫా’ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

