ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా…
విబి ఎంటర్టైన్మెంట్స్ ఫిలిం & టివి డైరెక్టరీ మరియు డిజిటల్ మీడియా అవార్డ్స్ బహూకరణ
విబి ఎంటర్టైన్మెంట్స్ 8వ ఫిలిం & టివి డైరెక్టరీ మరియు డిజిటల్ మీడియా అవార్డ్స్ అందించడం జరిగింది. విష్ణు బొప్పన గారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ పెద్దలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఫిలిం & టివి డైరెక్టరీను కెఎస్ రామారావు గారు ఆవిష్కరించగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, అంబికా కృష్ణ గారికి అందజేశారు. కెఎస్ రామారావు, తమ్మారెడ్డి భరద్వాజ్, అంబికా కృష్ణ, మాదాల రవి ఈ కార్యక్రమంలో పాల్గొని అవార్డులను అందచేశారు. అన్విత గ్రూప్, NCD నిఖిల కన్స్ట్రక్షన్స్ & డెవలపర్స్, లైట్ హౌస్ సినీ మ్యాజిక్, వివికె హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సెల్ బే మొబైల్స్, ముకుంద జెవెల్లెర్స్, శ్రీ భారతి గ్రూప్, అంబికా దర్బార్బత్తి, పొట్ల గ్రూప్ ఆఫ్ కంపెనీస్, మయూరి ఫ్యామిలీ రెస్టారెంట్, శ్రీ & శ్రీమతి స్వప్న శ్రీనివాస్ తదితర స్పాన్సర్స్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా ఫిలిం, టివి, డిజిటల్ & సోషల్ మీడియాలో ప్రసిద్ధి చెందిన వారికి అవార్డులను అందించడం జరిగింది.
ఈ సందర్భంగా కె.ఎస్. రామారావు గారు మాట్లాడుతూ, డిజిటల్ మీడియా అవార్డుల కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్రజలకు విజ్ఞానం, మంచి విలువలు, సానుకూల మార్పులు అందించే వేదికలుగా ఉండాలని సూచించారు. అనవసర ట్రోలింగ్, అసభ్యకర కంటెంట్, సినిమాలపై అధిక నెగెటివ్ ప్రచారం సమాజానికి మంచిది కాదన్నారు. క్రియేటర్లు తమ ప్రతిభను ప్రజల చైతన్యానికి, మంచి సందేశాల ప్రచారానికి ఉపయోగించాలని కోరారు.
తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మాట్లాడుతూ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు నేటి సమాజంపై ఎంతో ప్రభావం చూపుతున్నారని అన్నారు. ఎక్కువ మంది క్రియేటర్లు పాజిటివ్ కంటెంట్‌తో ప్రజలకు సమాచారం, వినోదం, అవగాహన అందిస్తున్నారని ప్రశంసించారు. సమాజ భవిష్యత్తు కొంతవరకు సోషల్ మీడియా చేతుల్లోనే ఉందని, అందుకే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే తన కొత్త సినిమా విడుదల సందర్భంగా అందరూ ఆదరించాలని కోరారు.
అంబికా కృష్ణ గారు మాట్లాడుతూ, ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రస్తుతం అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసే శక్తి లభించిందన్నారు. ఏఐ వంటి కొత్త టెక్నాలజీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, వాటికి అనుగుణంగా క్రియేటర్లు తమ సృజనాత్మకతను పెంచుకోవాలని సూచించారు. అయితే సినిమా విడుదలైన వెంటనే నెగెటివ్ రివ్యూలతో నిర్మాతలకు నష్టం కలిగించకుండా కనీసం కొన్ని రోజులు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
మాదాల రవి గారు మాట్లాడుతూ, సినిమా, టీవీ, సోషల్ మీడియా సమాజాన్ని చైతన్యవంతం చేసే శక్తివంతమైన సాధనాలని అన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు నిజమైన సమాచారం, సామాజిక అవగాహన అందించాలని సూచించారు. అవాస్తవ ప్రచారాలకు దూరంగా ఉండి, సమాజంలో మంచి మార్పులు తీసుకురావడానికి సోషల్ మీడియాను ఉపయోగించాలని కోరారు. కళాకారులను ప్రోత్సహిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విష్ణు బొప్పనను అభినందించారు.
బొప్పన విష్ణు గారు మాట్లాడుతూ, కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, అవార్డు గ్రహీతలు, మీడియా ప్రతినిధులు, స్పాన్సర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. డిజిటల్ మీడియా అవార్డులకు మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన స్పాన్సర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు.



