దూరదర్శని చూసిన ప్రేక్షకులకు సొంతూరికి వెళ్లిన ఫీల్ కలుగుతుంది: సువిక్షిత్
సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ 'దూరదర్శని'. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం హీరో సువిక్షిత్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆ విశేషాలివి. నేపథ్యం ఏమిటి? కడప జిల్లా రాయచోటి. నాకు వ్యాపారం ఉంది. చిన్నప్పటి నుండి సినిమాలంటే పాషన్.. సినిమాలను చూసి ఇన్‌స్పయిర్ అయ్యే వాడిని. అనుకోకుండా ఈ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఈ సినిమాలోకి హీరోగా ఎలా…
