రామ్ చరణ్ గారు తన పెర్ఫార్మెన్స్, డ్యాన్స్‌తో పెద్ది పాటలను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన…
‘స్వయంభూ’ శరవేగంగా జరుగుతున్న పోస్ట్-ప్రొడక్షన్ వీఎఫ్ఎక్స్ పనులు

నిఖిల్ సిద్ధార్థ తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘స్వయంభూ’తో రాబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో, పిక్సెల్ స్టూడియోస్ భువన్, శ్రీకర్‌ల నిర్మాణంలో, టాగోర్ మధు సమర్పణలో భారీ పీరియడ్ యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. ‘స్వయంభూ’ భారతీయ సినిమా రంగంలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. ఈ ఎపిక్ వెనుక ఉన్న వర్క్ ని చిత్ర బృందం ఇప్పుడు సినీ ప్రేమికులకు కళ్ళకు కట్టినట్లు చూపించింది.
తాజాగా విడుదలైన వీడియోలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ పనుల విస్తృత స్థాయిని చూపించారు. ఇందులో హీరో నిఖిల్ సిద్ధార్థ, దర్శకుడు భారత్ కృష్ణమాచారి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ కలిసి ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సంస్థ ఫాంటమ్ ఎఫ్‌ఎక్స్‌ను సందర్శించారు. అక్కడ వందలాది మంది నిపుణులు ‘స్వయంభు’ ప్రపంచాన్ని ఫ్రేమ్ ఫ్రేమ్‌గా అద్భుతంగా మలుస్తున్న తీరు వీడియోలో చూపించారు. ఈ చిత్రానికి ఏకంగా 2700కి పైగా వీఎఫ్‌ఎక్స్ షాట్లు, 750 మందికిపైగా టెక్నీషియన్లు పనిచేస్తుండటం విశేషం.
భారీ యుద్ధ సన్నివేశాలు, విశాలమైన ప్రాచీన రాజ్యాలు, అద్భుతమైన విజువల్ ప్రపంచాన్ని రూపొందిస్తున్నారు. ప్రతి సీజీ లేయర్‌ను చిత్రబృందం స్వయంగా పర్యవేక్షిస్తూ, తమ విజన్‌కు తగ్గట్టుగా తీర్చిదిద్దుతోంది. ముఖ్యంగా నిఖిల్, సెంథిల్ కుమార్ వీఎఫ్‌ఎక్స్ పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ప్రతి అంశాన్ని దగ్గరుండి పరిశీలిస్తున్నారు.
ఈ మాగ్నమ్ ఓపస్‌లో నిఖిల్ సరసన సంయుక్త, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించగా, నిఖిల్ పోషిస్తున్న యోధుడి పాత్రలోని వీరత్వాన్ని ఆవిష్కరించిన తొలి పాట ‘రా రా ధీవరా’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
‘స్వయంభు’ గ్రాండియర్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయి విజువల్స్‌ను కేకే సెంథిల్ కుమార్ (ISC) తన కెమెరాతో ఆవిష్కరిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ ను ఎం. ప్రభాహరణ్, రవీంద్ర నిర్వహిస్తున్నారు.
స్వయంభూ పాన్-ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది.
తారాగణం: నిఖిల్, సంయుక్త, నభా నటేష్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి
నిర్మాతలు: భువన్, శ్రీకర్
బ్యానర్: పిక్సెల్ స్టూడియోస్
సమర్పణ: ఠాగూర్ మధు
DOP: KK సెంథిల్ కుమార్
సంగీతం: రవి బస్రూర్
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: విజయ్ కామిశెట్టి
ప్రొడక్షన్ డిజైనర్లు: ఎం ప్రభాహరన్, రవీందర్
యాక్షన్: కింగ్ సోలమన్, స్టంట్ సిల్వా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో


