Skip to content

‘అరవింద్’తో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన రాక్‌స్టార్ అనిరుద్‌..

‘అరవింద్’తో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన రాక్‌స్టార్ అనిరుద్‌.. Telugu News
‘అరవింద్’తో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన రాక్‌స్టార్ అనిరుద్‌.. Telugu News
‘అరవింద్’తో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన రాక్‌స్టార్ అనిరుద్‌.. Telugu News

సంగీత సంచలనం..రాక్‌స్టార్‌ అనిరుధ్ రవిచందర్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆయ‌న త‌న సొంత ఇండిపెండెంట్ లేబుల్ అల్బుక‌ర్కీ రికార్డ్స్‌తో పాటు యూనివ‌ర్స‌ల్ మ్యూజిక్ ఇండియాతో క‌లిసి చేసిన ‘అరవింద్’ పాటను రిలీజ్ చేశారు. ఈ కాంబోలో రిలీజైన తొలి పాట ఇది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒరిజిన‌ల్ పాప్‌, హిప్ హాప్ ఆధారంగా రూపొందిన‌ ఈ ట్రాక్‌తో అనిరుద్ త‌న సంగీత ప్ర‌పంచంలోని ప‌రిధిని దాటి కొత్త ఆధ్యాయాన్ని ప్రారంభించారు.

2012లో విడుదలైన వైరల్ హిట్ ‘వై దిస్ కొలవెరి డి’ ద్వారా అనిరుద్ దేశవ్యాప్తంగా పాపులారిటీ పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాదిన జైల‌ర్‌, కూలీ, విక్ర‌మ్‌, లియో, దేవ‌ర పార్ట్ వ‌న్ వంటి ప‌లు బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అలాగే 2025లో షారుఖ్ ఖాన్ నటించిన జ‌వాన్‌ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కూడా సంగీత దర్శకుడిగా అక్క‌డ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు.

అనిరుద్..చాలా ఏళ్ల క‌ష్టంతో చిన్న స్థాయి నుంచి అసాధార‌ణ స్థాయికి ఎదిగి అభిమానుల‌తో పాటు సినీ ఇండ‌స్ట్రీ నుంచి కూడా రాక్‌స్టార్ అనే బిరుదుని సంపాదించుకున్నారు. ఇక అర‌వింద్ పాట విష‌యానికి వ‌స్తే.. వేగంగా మారుతోన్న డిజిట‌ల్ సంగీత ప్రపంచంలో త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకోవ‌టానికి ఓ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ప‌డే క‌ష్టాల‌ను ప్ర‌ధానంగా ఆవిష్క‌రించారు అనిరుద్‌.

ఈ పాట కథలో కేంద్రంగా నిలిచే పాత్ర పేరు అరవింద్. అనిరుధ్‌కి ప్రతిబింబంలాంటి పాత్ర ఇది. ఈగో, ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనా, సంగీతంపై ఉన్న ప్యాషన్‌తో తన జీవితాన్ని పూర్తిగా దానికి అంకితం చేసిన యువ సంగీతకారుడే అర‌వింద్‌. ఇప్పటి డిజిటల్ యుగంలో పాటలను విడుదల చేయటం చాలా సుల‌భం. అయితే ద‌క్షిణ భార‌త సినీ రంగంలో ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌గా ప్ర‌తిభ‌ను నిరూపించుకుంటూ కెరీర్‌ను కొనసాగించడం మాత్రం అంత సులువైన విష‌యం కాదు. అయినప్పటికీ ఏదో ఒక రోజు తన సంగీతం ప్రేక్షకులను చేరుకుంటుందనే నమ్మకంతో అరవింద్ ముందుకు సాగుతుంటాడు.

ఈ సంద‌ర్బంగా అనిరుద్ మాట్లాడుతూ ‘‘‘అరవింద్’ అంటే ప్రతి ఒక్కరిలో ఉండే ఓ త‌ర‌హా వ్యక్తిత్వమే. మన అందరి జీవితాల్లో ఓ అరవింద్ ఉంటాడు. అయితే తన ప్రతిభను చూపించడానికి ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తోన్న‌ ఓ స్వతంత్ర కళాకారుడి కథను ఈ పాట చెబుతుంది. అలాగే నేటి డిజిట‌ల్ ప్ర‌పంచంలో ఉన్న విప‌రీత‌మైన పోటీలో పెద్ద స్థాయికి చేరుకునే స‌మ‌యంలో ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఎదుర్కొనే సవాళ్లను ఇది చూపిస్తుంది” అన్నారు.

ఈ పాటకు అనిరుధ్‌కు వ్య‌క్తిగ‌తంగా క‌నెక్టింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే త‌ను కూడా జీవితంలో ఒకప్పుడు అరవింద్ వంటి ద‌శ‌ను ఎదుర్కొన్న‌వాడే. ఈ పాట ద్వారా ఇలాంటి ప్రయాణంలో ఉన్న ఇతర కళాకారులు, క్రియేటివ్ వ్యక్తులతో అనుబంధం ఏర్పరచుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. అలాగే తన ఎదుగుదల, ఎదురైన సవాళ్లు, అలాగే మొత్తం ఇండస్ట్రీ పై ధైర్యంగా, ఆత్మపరిశీలనతో కూడిన వ్యాఖ్యల‌నును కూడా ఈ పాట ద్వారా తెలియ‌జేస్తున్నారు.

అల్బుకర్కీ రికార్డ్స్ ద్వారా రాబోయే రోజుల్లో వివిధ రకాలైన ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్రాజెక్ట్స్ , కాన్సెప్చువ‌ల్ ప్రాజెక్ట్స్‌ను డెవ‌ల‌ప్ చేసి రిలీజ్ చేయ‌టానికి అనిరుద్ సిద్ధ‌మ‌వుతున్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.