Skip to content

ప్రైమ్ వీడియో “ఇసకపట్నం” చిత్ర ట్రైలర్ విడుదల

ప్రైమ్ వీడియో “ఇసకపట్నం” చిత్ర ట్రైలర్ విడుదల Telugu News
ప్రైమ్ వీడియో “ఇసకపట్నం” చిత్ర ట్రైలర్ విడుదల Telugu News
ప్రైమ్ వీడియో “ఇసకపట్నం” చిత్ర ట్రైలర్ విడుదల Telugu News

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియో తన తాజా తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ఇసకపట్నం’ ట్రైలర్ను హైదరాబాద్ లో ఘనంగా విడుదల చేసింది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ ఏడు ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్ను ప్రశాంత్ రఘతి రచించగా, తాజుద్దీన్ సయ్యద్ మాటలు అందించారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా నిర్మించిన ఈ సిరీస్లో ఐశ్వర్య రాజేష్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో పాటు సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపీ, రోహిణి, బెనర్జీ, జ్వాల కోటి, రవి వర్మ, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జూలై 2 నుంచి ప్రైమ్ వీడియో లో తెలుగు భాషతో పాటు తమిళం, హిందీ డబ్బింగ్ వెర్షన్లు, 15 భాషల సబ్టైటిల్స్తో ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా ప్రాంతాలలో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.

నేడు విడుదలైన ట్రైలర్ ఒక కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగే ఉత్కంఠభరిత కథను ఆవిష్కరించింది. నేరాలు, రాజకీయాలు, అధికార పోరాటాలు, వ్యక్తిగత విధేయతలు ఒకదానితో ఒకటి ఢీకొనే ఈ కథలో ఆశ, దురాశ, ప్రతీకారం ప్రధాన అంశాలు నిలుస్తాయి. అధికారం కోసం మనుషులు ఎంత దూరమైనా వెళ్లగలరు విషయాన్ని ఈ సిరీస్ బలంగా చూపించనుంది. యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్, ఊహించని మలుపులతో నిండిన కథ ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠ ఉంచుతుందని ట్రైలర్ స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా దర్శకుడు గ్యారీ బీహెచ్ మాట్లాడుతూ … “ఇసాకపట్నం ఒక కల్పిత ప్రపంచంలో సాగే కథ అయినప్పటికీ, ఇందులో పాత్రలు, వారి భావోద్వేగాలు చాలా నిజాయితీ గా ఉంటాయి. ఆశ, ప్రేమ, కోల్పోవడం, ప్రతీకారం వంటి అంశాలు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి. ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠ లో ఉండే ఎన్నో ట్విస్టులు ఇందులో ఉన్నాయి” అని దర్శకుడు గ్యారీ బీహెచ్ తెలిపారు.

‘ సముద్రఖని మాట్లాడుతూ … “ఈ కథలోని బలమైన భావోద్వేగాలు, నా పాత్రలో ఉన్న వైవిధ్యాలు నన్ను ఆకట్టుకున్నాయి. ఆశ, ప్రతీకారం, అధికారం కోసం మనుషులు ఎంత దూరమైనా వెళ్తారనే విషయాన్ని ఈ కథ బలంగా చెబుతుంది. నా కెరీర్లో ఇప్పటివరకు చేయని భిన్నమైన పాత్ర ఇది” అన్నారు.

‘ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ … “పవర్, సంఘర్షణ తో నిండిన ప్రపంచంలో తనదైన నిర్ణయాలతో ముందుకు సాగే మహిళా భారతి కనిపిస్తుంది. ఆమె ధైర్యం, బలహీనత, ఆత్మవిశ్వాసం కలగలిపిన పాత్ర. ఈ పాత్రను పోషించడం నాకు చాలా ప్రత్యేకమైన అనుభవం” అని చెప్పారు.

సునీల్ మాట్లాడుతూ … “ఇసకపట్నం ప్రపంచం చాలా వాస్తవంగా ఉంటుంది. ప్రతి పాత్రకు వారి సొంత లక్ష్యాలు, సంఘర్షణలు ఉంటాయి. నేను ఇప్పటివరకు చేయని కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాను” అన్నారు.

‘ నరేష్ అగస్త్య మాట్లాడుతూ … “ప్రతి ఎపిసోడ్తో కథ కొత్త మలుపులు తిరుగుతుంది. పాత్రల భావోద్వేగాలు, వారి నిర్ణయాలు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. ప్రేక్షకులు ఊహించని ఎన్నో సర్ప్రైజ్లు ఇందులో ఉంటాయి” అని తెలిపారు.

‘ మెరిన్ ఫిలిప్ మాట్లాడుతూ … “నిశ్శబ్దంగా కనిపించే ఒక మహిళ తన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు ఎదుర్కొని ఎలా బలంగా మారుతుందో ఈ పాత్రలో చూపించాం. ఆ ప్రయాణాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతృప్తినిచ్చింది” అని చెప్పారు.

అధికారం కోసం జరిగిన పోరాటాలు, కుటుంబ ద్రోహాలు, రాజకీయ ఎత్తుగడలు, ప్రతీకారాలతో నిండిన ‘ఇసకపట్నం’ జూలై 2 నుంచి ప్రైమ్ వీడియో లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.