Skip to content

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్న సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్, హీరో ప్రియదర్శి కాంబో మూవీ టీమ్

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్న సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్, హీరో ప్రియదర్శి కాంబో మూవీ టీమ్ Telugu News

ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ప్రియదర్శి హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నారు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటించనుంది. ఈ మూవీ టీమ్ తాజాగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ ను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఈ మూవీ టీమ్ కు తన బెస్ట్ విశెస్ అందించారు సుకుమార్.

ఈ సందర్భంగా హీరోయిన్ నాగదుర్గ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపారు. కంటెంట్ డ్రివెన్ ఫిలింస్ చేయడంలో ప్రసిద్ధి పొందిన సుకుమార్, బన్నీవాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై మూవీ లవర్స్ లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రామిసింగ్ మూవీస్ చేస్తున్న ప్రియదర్శి హీరో కావడం, ఏ ఫోక్ సాంగ్ చేసినా మిలియన్స్ లో వ్యూస్ రాబట్టే క్రేజ్ ఉన్న నాగదుర్గ హీరోయిన్ గా అరంగేట్రం చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మరింత క్రేజీగా మారింది.

తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా ఈ సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందించనున్నారు. ఈ నెల 25న ప్రారంభం కానున్న ఈ మూవీ వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ క్రేజీ కాంబో మూవీ గురించి మరిన్ని డీటెయిల్స్ త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.