Skip to content

“ఒక్కడు” 4Kలో చూసేందుకు ఎక్సైటింగ్ గా ఉన్నాను – రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్

“ఒక్కడు” 4Kలో చూసేందుకు ఎక్సైటింగ్ గా ఉన్నాను – రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ Telugu News

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్మెస్ రాజు గారు నిర్మాతగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో 2003లో మహేష్ బాబు హీరోగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన చిత్రం ఒక్కడు. సుమారు 23 సంవత్సరాల తర్వాత ఆంధ్ర, తెలంగాణతో పాటు భారతదేశవ్యాప్తంగా 4Kలో తెలుగులో విడుదలవుతుంది. మహేష్ బాబు కమర్షియల్ యాస్పెక్ట్స్ లో కర్నూలు కొండారెడ్డి బురుజు అంటే ఒక్కడు సినిమా అన్నట్లు ఒక మార్క్ సృష్టించి ఇండస్ట్రీ అంతా షేక్ చేసే విధంగా అద్భుతమైన విజయం సాధించిన ఈ చిత్రం రాధా మాధవి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సమర్పణలో రామ కృష్ణ గారిచే జూన్ 26వ రీ రిలీజ్ కానుంది. గుణ శేఖర్ కెరియర్ లో అలాగే మహేష్ బాబు కెరియర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచిన ఈ చిత్రం ప్రేక్షకులందరికీ మరోసారి అలరించేందుకు రానుంది. భూమిక చావ్లా హీరోయిన్గా నటించిన చిత్రంలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించారు. ముఖేష్ రిషి, తెలంగాణ శకుంతల, అజయ్, గీత, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రాజన్, అచ్యుత్ తదితరులు కీలకపాత్రను పోషించారు.

ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ… “ఒక్కడు, ప్రతి సంవత్సరం మరింత క్రేజ్ పెంచుకుంటూ ఇప్పటికే ఎన్నోసార్లు రీ రిలీజ్ అయినప్పటికీ మరోసారి రీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ నెల 26వ తేదీన సినిమాను 4Kలో విడుదల కానుంది. అందరిలాగా నేను కూడా ఈ సినిమాను చూసేందుకు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ప్రేక్షకులంతా ఈ సినిమాను మరోసారి 4Kలో చూసి అభినందించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.