Skip to content

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, రామ్ ఆచంట, గోపీ ఆచంట, 14 రీల్స్ ప్లస్, ఎం తేజస్విని నందమూరి ప్రజెంట్స్ ‘అఖండ 2: తాండవం’ దసరా స్పెషల్ గా సెప్టెంబర్ 25న పాన్-ఇండియా రిలీజ్- సెన్సేషనల్ బర్త్ డే టీజర్ రిలీజ్

Balakrishna
Balakrishna 1

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ ‘అఖండ 2: తాండవం’ కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ఈ హై-ఆక్టేన్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం.. ప్రతి అంశంలో అఖండను మించి ఉంటుదని హామీ ఇస్తోంది. ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు.

బాలకృష్ణ పుట్టినరోజు(జూన్ 10) పురస్కరించుకొని ‘అఖండ 2: తాండవం’ సెన్సేషనల్ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అదిరిపోయింది. ఈ టీజర్ తో బాలయ్యకు బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ అందించింది అఖండ 2 టీం.

ఈ టీజర్‌లో అద్భుతమైన ఎలిమెంట్ ఫెరోషియస్, డివైన్ తో కూడిన బాలకృష్ణ సెన్సేషనల్ లుక్. ఇది పాత్రకు పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యింది. బాలకృష్ణను అందరికంటే అద్భుతంగా ప్రెజంట్ చేయగలరని బోయపాటి మరోసారి నిరూపించారు.

టీజర్ లో త్రిశూలం నంది, మంచుతో కప్పబడిన కైలాసం నేపథ్యం మెస్మరైజ్ చేశాయి. ఇది పాత్ర వెనుక ఉన్న రీసెర్చ్, సినిమా ఇతివృత్తాన్ని ప్రజెంట్ చేశాయి. బాలకృష్ణ ఫెరోషియస్ యాక్షన్ గూస్ బంప్స్ తెప్పించింది.

”నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైన కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా.. అమాయకుల ప్రాణాలు తీస్తావా ‘అంటూ అఘోర పాత్రలో బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ మెస్మరైజ్ చేసింది.

రౌడీలని పక్కకు విసిరే సన్నివేశాలు, త్రిశూలం షాట్ మైండ్ బ్లోయింగ్ గా వున్నాయి. యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్-లక్ష్మణ్ బాలకృష్ణ మాస్ అప్పీల్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేశారు.

బాలకృష్ణ చెప్పిన డైలాగులు పవర్ ఫుల్ గా అద్భుతంగా వున్నాయి.

థమన్ నేపథ్య సంగీతంన నెక్స్ట్ లెవల్ లో వుంది. బాలకృష్ణ చిత్రానికి సంగీతం అందించే విషయంలో థమన్ కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ లో చేస్తారని మరోసారి రుజువైయింది.

14 రీల్స్ ప్లస్ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్‌ చాలా గ్రాండియర్ గా వుంది.

ప్రస్తుతం, ఈ సినిమాను జార్జియాలోని గ్రాండ్ లొకేల్స్‌లో చిత్రీకరిస్తున్నారు. అక్కడ అద్భుత సన్నివేశాలని షూట్ చేస్తున్నారు.

సెప్టెంబర్ 25న దసరా స్పెషల్‌గా థియేటర్లలో ఈ సినిమా తాండవం చేస్తుందని మేకర్స్ తెలియజేశారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

టీజర్ గూస్ బంప్స్ తెప్పించింది. సినిమాపై అంచనాలని భారీగా పెంచింది.

ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది. డైనమిక్ ఆది పినిశెట్టి ఇంటెన్స్ పాత్రని పోషిస్తున్నారు. టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. సంగీత సంచలనం S థమన్ సంగీతం అందిస్తున్నారు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ C రాంప్రసాద్ డీవోపీగా పని చేస్తున్నారు. ఎడిటర్ తమ్మిరాజు. AS ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.

నటీనటులు: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
సమర్పణ: ఎం తేజస్విని నందమూరి
సంగీతం: థమన్ ఎస్
డీవోపీ: C రాంప్రసాద్, సంతోష్ D Detakae
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.