Skip to content

‘3 BHK’ నుంచి ఆగిపోను నేను సాంగ్ రిలీజ్

Sidharda

సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘3 BHK’. బ్లాక్ బస్టర్ హిట్ ‘మావీరన్’ నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వ వచ్చింది.

ఫస్ట్ సింగిల్ కలలన్నీ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. తాజాగా సెకండ్ సింగిల్ ఆగిపోను నేను రిలీజ్ చేశారు.

అమృత్ రామ్‌నాథ్ సాంగ్ ని ఎనర్జీటిక్ గా కంపోజ్ చేశారు. దేవ సాహిత్యం అందించడంతో పాటు సాంగ్ ని అద్భుతంగా పాడారు. మూవీ థీంని ప్రజెంట్ చేసిన ఈ సాంగ్ లో సిద్ధార్థ్ డిఫరెంట్ లుక్స్ అదిరిపోయాయి.

ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈసినిమా రూపొందుతోంది.

ఈ చిత్రానికి అమృత్ రామ్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. దినేష్ కృష్ణన్ బి & జితిన్ స్టానిస్లాస్ డీవోపీగా పని చేస్తున్నారు. గణేష్ శివ ఎడిటర్. రాకేందు మౌళి డైలాగ్ రైటర్.

ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జూలై 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

నటీనటులు: సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు, మీఠా రఘునాథ్ , చైత్ర
రచన, దర్శకత్వం: శ్రీ గణేష్
నిర్మాత : అరుణ్ విశ్వ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్. సిబి మారప్పన్
ఫోటోగ్రఫీ డైరెక్టర్: దినేష్ కృష్ణన్ బి & జితిన్ స్టానిస్లాస్
సంగీతం: అమృత్ రామ్‌నాథ్
ఎడిటర్: గణేష్ శివ
డైలాగ్స్: రాకేందు మౌళి
ఆర్ట్ డైరెక్టర్: వినోద్ రాజ్‌కుమార్ ఎన్
కాస్ట్యూమ్ డిజైనర్: అశోక్ కుమార్ ఎస్ & కిరుతిక ఎస్
పీఆర్వో: వంశీ- శేఖ

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.