Skip to content

‘బ్యాడ్ గాళ్స్’ నుంచి ‘ఇలా చూసుకుంటానే’ సాంగ్‌

‘బ్యాడ్ గాళ్స్’ నుంచి ‘ఇలా చూసుకుంటానే’  సాంగ్‌ Telugu News
‘బ్యాడ్ గాళ్స్’ నుంచి ‘ఇలా చూసుకుంటానే’  సాంగ్‌ Telugu News

నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ముఖ్య తారాగణం తో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా ధులిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో ఎంటర్టైనర్ చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందిస్తుండగా మెలోడీ కింగ్ అనూప్ రూబెన్స్ తన చక్కని భాణీలతో ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ 5 మిలియన్ వ్యూస్ తో సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో నడుస్తోంది.

ఇప్పుడు మరో మెలోడీ పాటను తెలుగు ప్రేక్షకులకు త్వరలో అందించబోతున్నారు. ‘ఇలా చూసుకుంటానే’ అనే పాటకి చంద్రబోస్ సాహిత్యం అందించగా సిద్ శ్రీరామ్ పాడారు. ఈ పాటకు సంబంధించి విడుదల అయిన ప్రీ టీజర్ దూసుకుపోతుంది, ఈ ప్రీ టీజర్ లో చంద్ర బోస్ గారు కూడా యాక్టింగ్ అద్భుతంగా చేశారు

ఈ చిత్ర దర్శకుడు మున్నా ధూళిపూడి మాట్లాడుతూ ఇప్పుడు ‘ఇలా చూసుకుంటానే’ అనే పాట ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం ద్వారా త్వరలో విడుదల చేస్తున్నాం. చంద్ర బోస్ గారు అందించిన లిరిక్స్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ స్వర పరిచిన పాట మరియు సిద్ శ్రీరామ్ పాడిన పాట ‘నీలి నీలి ఆకాశం’ పాట కంటే గొప్పగా వచ్చింది. త్వరలో విడుదల చేస్తాం. ‘బ్యాడ్ గాళ్స్’ అనేది పూర్తి ఎంటర్టైనర్ చిత్రం. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం మా ‘బ్యాడ్ గాళ్స్’” అని తెలిపారు.

తారాగణం: అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్

సాంకేతిక బృందం:
దర్శకుడు: మున్నా ధులిపూడి
బ్యానర్స్: ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్
నిర్మాతలు: శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె ఎమ్ కుమార్
సంగీతం: అనూప్ రూబెన్స్
లిరిక్స్: ఆస్కార్ చంద్ర బోస్
సాహిత్యం: చంద్రబోస్
సినిమాటోగ్రాఫర్: ఆర్లి గణేష్
ఎడిటర్: బొంతల నాగేశ్వరరెడ్డి

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.