Skip to content

ఆహా’లో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ షో చేస్తుండటం గర్వంగా ఉంది – సీజన్ 4 స్క్రీనింగ్, గ్రాండ్ ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్

ఆహా’లో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ షో చేస్తుండటం గర్వంగా ఉంది – సీజన్ 4 స్క్రీనింగ్, గ్రాండ్ ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ Telugu News
ఆహా’లో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ షో చేస్తుండటం గర్వంగా ఉంది – సీజన్ 4 స్క్రీనింగ్, గ్రాండ్ ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ Telugu News

తెలుగులో అతి పెద్ద సింగింగ్ షో ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ సీజన్ లో టాప్ 12 కంటెస్టెంట్స్ టాలెంట్ ను ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం 7 గంటల నుంచి ఆహాలో చూడొచ్చు. ఈ సంగీత కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్ మరియు గీతా మాధురి జడ్జెస్ గా అలాగే శ్రీరామచంద్ర హోస్ట్ గా, సమీరా భరద్వాజ్ కో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో

సింగర్ సమీరా భరద్వాజ్ మాట్లాడుతూ – తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 వంటి ప్రెస్టీజియస్ షోలో హోస్ట్ గా చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఈ షో గురించి మాట్లాడే ప్రతి మాటా నా మనసులో నుంచే వస్తోంది. అల్లు అరవింద్ గారికి, తమన్ గారికి థ్యాంక్స్. చెప్పాల్సినవి ఎన్నో ఉన్నాయి, అవన్నీ షోలోనే మాట్లాడుతాను. అన్నారు.

సింగర్ గీతా మాధురి మాట్లాడుతూ – తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4కు జడ్జ్ గా వ్యవహరించే అవకాశం ఇచ్చిన ఆహాకు థ్యాంక్స్. ఇది మూడోసారి వరుసగా నేను ఈ కార్యక్రమానికి జడ్జ్ గా చేస్తున్నాను. నేను కూడా రియాల్టీ షోస్ లో పాడే సింగర్ గా ఎదిగాను. ఇప్పుడు ఈ కంటెస్టెంట్స్ ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లు ఉంటోంది. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 పెద్ద సక్సెస్ కావాలి, కంటెస్టెంట్స్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ – తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 చేసే అవకాశాన్ని నాకు కల్పించింది అల్లు అరవింద్ గారు, త్రివిక్రమ్ గారు. వారికి థ్యాంక్స్ చెబుతున్నా. నీలో ఓ కవి ఉన్నాడు అని త్రివిక్రమ్ గారు అనేవారు. ఈ షో మాలో ఒక కొత్త మార్పు తీసుకొచ్చింది. దాదాపు 6 వేల మంది కంటెస్టెంట్స్ నుంచి 12 మందిని సెలెక్ట్ చేయడం అంటే ఎంత టాలెంట్ పోటీ పడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ షో తర్వాత మేము మ్యూజిక్ కన్సర్ట్స్ కు వెళ్తే ఇండియన్ ఐడల్ లో బాగా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. మా కన్సర్ట్స్ కు హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్య రెట్టింపు అవుతోంది. అలాంటి గుర్తింపు మాకు తెలుగు ఇండియన్ ఐడల్ తీసుకొచ్చింది. నేను చేసిన సినిమాలు వాళ్ల ఇంటిదాకా తీసుకెళ్తే, ఈ షో నన్ను ప్రేక్షకుల ఇంటిలోపలికి తీసుకెళ్లింది. తెలుగు ఇండియన్ ఐడల్ కు పనిచేయడం ఒక బాధ్యతగా, గౌరవంగా భావిస్తున్నాం. ఈ షోలో డల్లాస్ నుంచి కూడా కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఈ షోను ఆర్గనైజ్ చేయబోతున్నాం. అందుకే గల్లీ టు గ్లోబల్ అనే క్యాప్షన్ పెట్టాం. కంటెస్టెంట్స్ పాడటం ఒక్కటే కాదు వారి కుటుంబ సభ్యుల భావోద్వేగాలు, ఇక్కడ గెలుపు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేవి అన్నీ క్యాప్చర్ చేస్తున్నాం. ఈ షోకు వస్తే మాకు హాలీడేకు వచ్చిన ఫీల్ కలుగుతుంటుంది. తెలుగు ఇండియన్ ఐడల్ ను ఒక ఆస్తిలా భావిస్తున్నాం. అన్నారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ – ఈ రోజు వేరే మీటింగ్ ఉండి ఈ కార్యక్రమానికి రాలేకపోతానేమో అనుకున్నాను కానీ రాకపోయి ఉంటే ఇంత మంచి కొత్త టాలెంట్ ను నేరుగా చూసే అవకాశం మిస్ అయ్యేది. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అద్భుతంగా వచ్చింది. అంత బాగా మీరు చేస్తానంటేనే సీజన్ 4కు ఇన్వెస్ట్ మెంట్ పెడదాం అని అన్నాను. ఇండియన్ ఐడల్ వారికి ప్రతి సీజన్ కు డబ్బు ఇచ్చి రైట్స్ తీసుకోవాల్సిఉంటుంది. గత సీజన్ కంటే ఈ సీజన్ 4 బాగా చేస్తున్నారు. ఇందుకు తమన్ కు థ్యాంక్స్ చెప్పాలి. ఈ షోకు తమన్ లైఫ్ తీసుకొచ్చాడు. స్కూల్ లో చదువుతున్న పిల్లలు కూడా వచ్చి బాగా పాడుతున్నారు. ఇతర రాష్ట్రాల పిల్లలు తెలుగు నేర్చుకుని పాడుతున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ క్రేజ్ ఎంతలా ఉందంటే అమెరికాలో ఈ కార్యక్రమాన్ని చూస్తూ అక్కడి నుంచి కంటెస్ట్ చేసేందుకు వచ్చారు. మనం గల్లీ టు ఢిల్లీ అంటాం, కానీ ఇది గల్లీ టు గ్లోబల్ అయ్యింది. ఆహా నుంచి తెలుగు ఇండియన్ ఐడల్ షో చేస్తున్నందుకు గర్వంగా ఉంది. అన్నారు

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.