Skip to content

బైకర్ మూవీ కోసం చార్మింగ్ స్టార్ శర్వా జా-డ్రాపింగ్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్

బైకర్ మూవీ కోసం చార్మింగ్ స్టార్ శర్వా జా-డ్రాపింగ్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ Telugu News

చార్మింగ్ స్టార్ శర్వా తన 36వ మూవీ ‘బైకర్’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. స్పోర్ట్స్ & ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తుండగా, ప్రతిష్టాత్మకమైన యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. దీపావళి సందర్భంగా విడుదలైన టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ప్రొఫెషనల్ మోటార్‌సైకిల్ రేసర్ పాత్రలో కనిపించబోతున్న శర్వా తన పాత్ర కోసం జా-డ్రాపింగ్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. తాజాగా విడుదలైన ఫోటోషూట్ స్టిల్స్ లో ఆయన ఫిజిక్, కాన్ఫిడెన్స్ అంతా కలిపి కొత్త శర్వా ప్రజెంట్ చేశాయి. షర్ట్‌లెస్ లుక్స్‌లో షార్ప్ అబ్స్‌తో, ఫైరీ గేజ్‌తో రేసర్ స్పిరిట్‌ను అద్భుతంగా చూపించారు.

శర్వా తన పాత్రకు సరిపడేలా లీన్ అండ్ అథ్లెటిక్ బాడీని తీర్చిదిద్దుకున్నారు. నెలల తరబడి వర్కౌట్స్‌, డైట్‌, డెడికేషన్‌ తో ట్రాన్స్‌ఫర్మేషన్ సాధించారు. ఇంత ఫిట్‌గా, ఎనర్జీగా శర్వా కనిపించడం అభిమానులకు పండుగలా మారింది.

ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీకి జె. యువరాజ్, మ్యూజిక్‌కు జిబ్రాన్, అనిల్ కుమార్ పి ఎడిటర్. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్. ఎ పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు, ఎన్ సందీప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

శర్వా కొత్త లుక్‌, కథ కాన్సెప్ట్‌, టాప్ టెక్నికల్ టీమ్‌ ఇవన్నీ కలసి ‘బైకర్’ సినిమాను ఒక థ్రిల్లింగ్ ఎమోషనల్ రైడ్ గా మార్చబోతున్నాయి. అభిమానులు ఇప్పుడు శర్వా కొత్త అవతార్ ని థియేటర్స్‌లో చూడటానికి ఎదురుచూస్తున్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.