మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో క్విట్ ఇండియా ప్రోగ్రామ్లో భాగంగా యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో గురువారం ఉచిత…
*అన్నగారు వస్తారు” టీజర్ రిలీజ్

స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ “వా వాతియార్” తెలుగు ప్రేక్షకుల ముందుకు “అన్నగారు వస్తారు” టైటిల్ తో రాబోతోంది. ఈ సినిమా డిసెంబర్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “అన్నగారు వస్తారు” చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ రోజు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియా ద్వారా “అన్నగారు వస్తారు” సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉందన్న అనిల్ రావిపూడి..హీరో కార్తీ, ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా, ఇతర టీమ్ మెంబర్స్ కు తన బెస్ట్ విశెస్ అందించారు. “అన్నగారు వస్తారు” టీజర్ ఎలా ఉందో చూస్తే – ‘పోలీస్ ఆఫీసర్ గా హీరో కార్తి రాకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంటారు స్థానిక ప్రజలు. వారితో కలిసి జోష్ ఫుల్ డ్యాన్స్ స్టెప్స్ తో స్టైలిష్ గా ఎంట్రీ ఇస్తాడు కార్తి. ఈ సెలబ్రేషన్స్ జరుగుతుండగానే, మరోవైపు కృతిశెట్టి, సత్యరాజ్, ఆనంద్ రాజ్, రాజ్ కిరణ్ వంటి కీ రోల్స్ ను పరిచయం చేశారు. హీరో కార్తి చేసిన పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సులతో టీజర్ ఆకట్టుకుంది’. “అన్నగారు వస్తారు” సినిమాలో ప్రేక్షకులు ఎంజాయ్ చేయబోయే యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్ ను టీజర్ చిన్న శాంపిల్ గా చూపించింది.
నటీనటులు – కార్తి, కృతి శెట్టి, సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్, తదితరులు
టెక్నికల్ టీమ్
——————–
సినిమాటోగ్రఫీ – జార్జ్ సి. విలియమ్స్
ఎడిటింగ్ – వెట్రే కృష్ణన్
మ్యూజిక్ – సంతోష్ నారాయణన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్ – స్టూడియో గ్రీన్
నిర్మాత – కె. ఇ. జ్ఞానవేల్ రాజా
రచన, దర్శకత్వం – నలన్ కుమారస్వామి
