నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్…
సంక్రాంతి కానుకగా ప్రభాస్ నిమ్మల “మిరాకిల్” ఫస్ట్ లుక్!!

రణధీర్ భీసు, హెబ్బా పటేల్, సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ ముఖ్య తారాగణం!!
సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఏగ్గిడి – శ్రీకాంత్ మొగదాసు – చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “మిరాకిల్”. “సత్య గ్యాంగ్, ఫైటర్ శివ” చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంక్రాంతి కానుకగా జనవరి 16న విడుదల కానుంది!!
రణధీర్ భీసు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ హీరోయిన్. ఆకాంక్ష మరో హీరోయిన్. సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నరేష్ నాయుడు, జనార్దన్, యోగి కాత్రే, విజయ్ సూర్య, ఇంతియాజ్, సాయిబాబా, దిల్ రమేష్, ఝాన్సీ, సూర్యనారాయణ, శ్రీధర్, శ్రీకాంత్, శివ, ఆమని, హైమావతి, నవ్య (అమ్ము) బెజవాడ మస్తాన్, ధీరజ అప్పాజీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కెమెరా: సురేందర్ రెడ్డి, ఎడిటింగ్: విశ్వనాధ్, మ్యూజిక్: ప్రభాస్, లిరిక్స్: రాంబాబు గోశాల, ఫైట్స్ – శ్రీను!!
