-శ్రీ విష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్' చిత్రం నుంచి 'ఒరియా పిల్ల' సాంగ్ లాంచ్- సిద్ శ్రీరామ్…
‘రావు బహదూర్’ కోసం చేసిన డ్యాన్సులు నా కెరీర్‌లోనే చాలా స్పెషల్ – హీరో సత్యదేవ్
-సత్యదేవ్ ‘రావు బహదూర్’ నుంచి వింటేజ్ గ్లామర్ సెకండ్ సింగిల్ ‘దేశ సంచారి’ సాంగ్ లాంచ్
సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ‘ఓ సుందరి’ పాట, టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఈ రోజు చిత్ర బృందం రెండో పాట ‘దేశ సంచారి’ ని విడుదల చేసింది.
‘దేశ సంచారి’ పాట ఆల్బమ్‌కు రెట్రో టచ్, విన్టేజ్ గ్లామర్‌ను తీసుకొచ్చే ప్రత్యేక గీతంగా నిలిచింది. సంగీత దర్శకుడు స్మరణ్ సాయి అందించిన ఈ కంపోజిషన్ ఉత్సాహభరితమైన బీట్‌లు, ఆకట్టుకునే హుక్స్‌తో అదిరిపోతుంది. వింటేజ్ మాధుర్యాన్ని గుర్తు చేస్తూనే, నేటి ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యేలా ఈ పాటను తీర్చిదిద్దారు.
రెహమాన్ అందించిన సాహిత్యం, హేమచంద్ర, ప్రియాంక గజానన్ పాడిన తీరు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి స్వరాలు పాటలోని విన్టేజ్ ఫీల్‌ను మరింత బలంగా ప్రజెంట్ చేశాయి.
ఈ పాటలో ప్రధాన ఆకర్షణ దాని విజువల్ ప్రెజెంటేషన్. భారీ స్థాయిలో రూపొందించిన పబ్ సెటప్‌లో సత్యదేవ్, హైడీ కరోలా శ్రవణ్ ముప్పిరి కొరియోగ్రఫీ చేసిన సాల్సా స్టయిల్ లో డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రతి ఫ్రేమ్‌ను మరింత ప్రత్యేకంగా మార్చాయి.
రెట్రో వైబ్, అద్భుతమైన మ్యూజిక్, స్టైలిష్ విజువల్స్‌తో ‘దేశ సంచారి’ పాట సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘రావు బహదూర్’లో ఒక రిఫ్రెషింగ్ మ్యూజికల్ మూమెంట్‌గా నిలుస్తోంది. థియేటర్లలో ఈ పాట ప్రేక్షకులను మరింత అలరించేలా ఉంది.
ఈ చిత్రంలో దీపా థామస్ కథానాయికగా నటిస్తుండగా, వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాకా, మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కథతో పాటు సాంకేతికంగా కూడా ‘రావు బహదూర్’ ప్రత్యేకంగా నిలుస్తోంది. కార్తీక్ పరమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, స్మరణ్ సాయి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రోహన్ సింగ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రావు బహదూర్’ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
*ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు చిత్ర బృందం సమాధానాలు ఇచ్చారు.
సత్యదేవ్ మాట్లాడుతూ.. మీ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఈ స్థాయిలో డ్యాన్స్‌లు చేసినట్టుగా ఉంది?
-అందరికీ డ్యాన్స్ విషయంలో ఈ ఒక పాటే కనిపిస్తుంది. కానీ ఇందులో ఇంకో రెండు పాటలు కూడా ఉన్నాయి. నా కెరీర్ లోనే ఫస్ట్ టైం ఈ స్థాయిలో డ్యాన్సులు చేశాను. ఇది సాల్సా స్టయిల్ డ్యాన్స్. నిజానికి ఇలాంటి డ్యాన్స్ చేయాలంటే పది, పదిహేనేళ్ల ప్రాక్టీస్ కావాలి. నాకు ఎంతో ఓపికగా నేర్పించి చేయించిన మా డాన్స్ మాస్టర్ కు థాంక్యూ. నా డ్యాన్స్ మీకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది.
-ఈ పాట చేసినప్పుడు నా కండరాలు, వెన్నుపూస కూడా కొంచెం దెబ్బతిన్నాయి (నవ్వుతూ). కానీ ఫైనల్‌గా పాట చాలా అద్భుతంగా వచ్చింది.
-నాకు స్క్రీన్‌పై మెగాస్టార్ చిరంజీవి గారి డ్యాన్స్‌లు చూడటం చాలా ఇష్టం. ఆయన ప్రపంచంలోనే గొప్ప డ్యాన్సర్లలో ఒకరు.
-ఈ పాటకు ‘దేశ సంచారి’ అనే లైన్ చాలా చక్కగా కుదిరింది. ఇదే సమయంలో మహేష్ బాబు గారి వారణాసి సినిమాలో కూడా ‘సంచారి’ అనే పాట ఉండటం యాదృచ్ఛికంగా జరిగిందని భావిస్తున్నాను. ఈ టైమింగ్‌ను దేవుడే సమకూర్చాడనిపించింది.
-ఈ సినిమాలో మొత్తం ఏడు గెటప్స్ ఉన్నాయి. అందులో నాకు చాలా ఇష్టమైనది రామప్ప గెటప్.
వెంకటేష్ మహా గారు.. మిమ్మల్ని చూస్తుంటే మీరు సత్యదేవ్‌లా మారిపోయినట్టున్నారు?
-సత్య, నేను బ్రదర్స్‌లా ఉంటాం. సత్యకు ఏదైనా పెర్ఫార్మెన్స్ గురించి చెబితే, మనం ఏం కోరుకుంటామో దాన్ని అద్భుతంగా తెరపై చూపించగలడు. ప్రతి విషయాన్ని చాలా ఈజీగా అర్థం చేసుకుంటాడు. మా ఇద్దరి ఆలోచనలు కూడా చాలా విషయాల్లో సింక్ అవుతుంటాయి.
-ఈ పాటలో సత్య డ్యాన్స్ చేస్తుంటే నేను మానిటర్ దగ్గర చాలా ఎక్సైట్ అయ్యేవాడిని. ఈ పాటను రెండు రోజుల్లో షూట్ చేశాం. ఆ రెండు రోజులు కూడా సత్యను చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. ప్రతి స్టెప్‌ను మేమంతా ఎంతో సెలబ్రేట్ చేసుకున్నాం.
-ఈ పాట కోసం ప్రొఫెషనల్ క్లబ్ డ్యాన్సర్ హైడీ కరోలాను ఎంపిక చేశాం. ఆమె చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది.
-ఇందులో ఇంకో రెండు పాటలు కూడా చాలా కొత్తగా ఉంటాయి. ఆ రెండు పాటలు కూడా థియేటర్లలో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తాయి.
ఈ సందర్భంగా మీతో ఒక విషయం పంచుకోవాలి. కమల్ హాసన్ గారు ఒకసారి తన రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ, “నా తర్వాతి తరంలో నాలా పెర్ఫార్మ్ చేసే నటుడు కనిపిస్తే నేను రిటైర్ అవుతాను” అన్నారు. ఆయన మనందరికీ స్ఫూర్తి. ఆయన ఎప్పటికీ రిటైర్ కాకూడదు. కానీ ఆయన స్థాయిలో పెర్ఫార్మ్ చేసే నటుడు మా తరానికి దొరికాడు. ఆయనే సత్యదేవ్. ఈ సినిమాతో సత్య అది ఎచీవ్ చేశాడు.
అనురాగ్ మాట్లాడుతూ.. ఇందులో ఉన్న మిగతా రెండు పాటలు కూడా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తాయి. వాటి కొరియోగ్రఫీ, ప్రెజెంటేషన్ చాలా కొత్తగా ఉంటాయి. ఆ రెండు పాటలు కథను ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాయి. ప్రేక్షకులకు ఇది ఒక కొత్త అనుభవం అవుతుంది. ఈ సినిమాలో సత్యదేవ్ గారు ఏడు గెటప్స్‌లో కనిపిస్తారు. ప్రతి గెటప్‌కు ప్రత్యేకమైన లుక్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కుదిరింది. మహేష్ బాబు గారు ఈ సినిమాను రేపు చూడబోతున్నారు.
తారాగణం: సత్య దేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం, ఎడిటర్: వెంకటేష్ మహా
సమర్పణ: మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ GMB ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి & శరత్ చంద్ర
ప్రొడక్షన్ బ్యానర్స్: A+S మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దినేష్ యాదవ్ బి
డీవోపీ: కార్తీక్ పర్మార్
సంగీతం: స్మరణ్ సాయి
ప్రొడక్షన్ డిజైనర్: రోహన్ సింగ్
PRO: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైన్స్: ఎల్లో టూత్స్



