Skip to content

ఈటీవీ విన్ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటున్న ముళ్ళపూడి వరా “గొల్ల రామవ్వ”

ఈటీవీ విన్ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటున్న ముళ్ళపూడి వరా “గొల్ల రామవ్వ” Telugu News
ఈటీవీ విన్ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటున్న ముళ్ళపూడి వరా “గొల్ల రామవ్వ” Telugu News

స్వర్గీయ భారత ప్రధాని పి.వి.నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపంగా ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన రోమాంఛిత వీరగాథ “గొల్ల రామవ్వ”కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. జనవరి 25 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి అసాధారణ స్పందన లభిస్తోంది. ఈ చిత్రాన్ని సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్ – వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై… రామ్ విశ్వాస్ హనూర్కర్ – రాఘవేంద్రవర్మ (బుజ్జి) సంయుక్తంగా నిర్మించారు. అజహర్ షేక్ ఈ చిత్రానికి కార్యనిర్వాహక నిర్మాతగా కీలక బాధ్యతలు నిర్వహించడంతోపాటు… సాహిత్యం సమకూర్చారు.

ఇంతకుముందు ఈటీవీ విన్ కోసం “మౌనమే నీ భాష” చిత్రాన్ని నిర్మించి, వీక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన టీమ్ నుంచి వచ్చిన “గొల్ల రామవ్వ” రెట్టింపు స్పందన రాబడుతుండడం విశేషం . “తెలుగు సీతామాలక్ష్మి” తాళ్ళూరి రామేశ్వరి టైటిల్ పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంపై కురుస్తున్న ప్రశంసల వర్షంపై చిత్ర దర్శకుడు ముళ్ళపూడి వరా హర్షం వ్యక్తం చేశారు. నిర్మాతలు రామ్ విశ్వాస్ హనూర్కర్ – రాఘవేంద్రవర్మ (బుజ్జి)లతోపాటు… ఈ చిత్ర రూపకల్పనలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పి.వి.నరసింహారావు కుమారుడు పి.వి.ప్రభాకరరావు, కుమార్తె సురభి వాణీదేవిలకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు!!

అల్లు గీత, అన్విత్, మణి మంతెన ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, గానం : వరం, సంగీతం: సాయి మధుకర్, ఛాయాగ్రహణం: గంగమోని శేఖర్, కూర్పు: రాఘవేంద్రవర్మ, రచన: బయ్యవరపు రవి, కార్యనిర్వాహక నిర్మాత & సాహిత్యం: అజహర్ షేక్, నిర్మాతలు: రామ్ విశ్వాస్ హనూర్కర్ – రాఘవేంద్రవర్మ (బుజ్జి), చిత్రానువాదం – దర్శకత్వం: ముళ్ళపూడి వరా!!

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.