Skip to content

‘విప్లవ వీరుడు’ మూవీ షూటింగ్ ప్రారంభం

‘విప్లవ వీరుడు’ మూవీ షూటింగ్ ప్రారంభం Telugu News
‘విప్లవ వీరుడు’ మూవీ షూటింగ్ ప్రారంభం Telugu News
‘విప్లవ వీరుడు’ మూవీ షూటింగ్ ప్రారంభం Telugu News

▪️ ఫిలింనగర్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలు
▪️ కీలక పాత్రలో ప్రముఖ నటి ఇంద్రజ

హైదరాబాద్:
భారత స్వాతంత్ర సంగ్రామంలో సామాన్యులే వీరులై పోరాడిన చరిత్రను తెరకెక్కిస్తున్న మూవీ ‘విప్లవ వీరుడు’. ప్రముఖ నటి ఇంద్రజ కీలక పాత్రలో జైశ్వర్- సోనాలి జంటగా ఎస్ నాగరాజ్ రావు దర్శకత్వంలో ఏవీ జయరాం నిర్మిస్తున్న ఈ సినిమా ఫిలింనగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించుకుంది. ముహూర్తం షాట్ కు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇంద్రజపై క్లాప్ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు.

ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంద్రజ మాట్లాడుతూ,
“స్వాతంత్ర కాలం నాటి కథను చాలా సహజంగా తెరకెక్కిస్తున్నారు. సామాన్య ప్రజలు కూడా స్వాతంత్ర పోరాటంలో ఎలా పాల్గొన్నారు అనే అంశాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఒక సామాన్యుడు విప్లవ వీరుడిగా మారి స్వతంత్ర ఉద్యమంలో విరోచితంగా పోరాడే కథ ఇది. ఈ చిత్రంలో నేను రాణి భవానిదేవి పాత్రలో కనిపించబోతున్నాను. బ్రిటిష్ వారిని ఎలా ఎదుర్కొన్నామన్నదే కథాంశం. అర్థవంతమైన కథతో నిర్మాత జయరాం మంచి సినిమా నిర్మిస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.” అని అన్నారు.

హీరో జైశ్వర్ మాట్లాడుతూ,
“విప్లవ వీరుడు పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నాను. ఈ పాత్ర నాకు ఎంతో ప్రత్యేకం. సినిమా చరిత్రలో నిలిచిపోతుంది.” అని చెప్పారు.

హీరోయిన్ సోనాలి మాట్లాడుతూ,
“నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు. ఇది నా మొదటి సినిమా. మీ అందరి ఆశీర్వాదం కావాలి” అని అన్నారు.

దర్శకుడు ఎస్ నాగరాజు రావు మాట్లాడుతూ,
“ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. బ్రిటిష్ కాలం నాటి హిస్టారికల్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఇందులో ఇంద్రజ గారు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు” అని తెలిపారు.

నిర్మాత ఏవీ జయరాం మాట్లాడుతూ,
“టిప్పు సుల్తాన్ కాలం నాటి కథ ఇది. బ్రిటిష్ వారు వ్యాపారం పేరుతో దేశాన్ని ఎలా దోచుకున్నారో, ఆ పరిణామాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం. మంచి సందేశం ఇచ్చే సినిమా అవుతుంది” అని చెప్పారు.

నటుడు పటేల్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ,
“మనమిప్పుడు స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఆనాటి పోరాట యోధుల త్యాగాలే కారణం. అలాంటి మహనీయులను తెరపై చూపించే సినిమా ఇది” అని అన్నారు.

బ్యానర్: AVJR ప్రొడక్షన్స్
నటీనటులు: ఇంద్రజ, జైశ్వర్, సోనాలి శెట్టి, Co artistes. Indraja. Kishore. Raghini prajwal, తదితరులు.
నిర్మాత: ఏవీ జయరాం
దర్శకుడు: ఎస్ నాగరాజ్ రావు
టెక్నికల్ డైరెక్టర్, DOP: మాత్యు రాజన్
మ్యూజిక్: ఉదయ్
ఎడిటర్: MNR
PRO: అశోక్ దయ్యాల

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. We covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.