Skip to content

టాలీవుడ్ లాంటి గొప్ప ఇండస్ట్రీ ప్రపంచంలో ఎక్కడా ఉండదు – శర్వానంద్

కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మూవీ “యూత్”. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా “యూత్” మూవీకి తెలుగు ప్రేక్షకుల ఘన విజయాన్ని అందించారు. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను చార్మింగ్ స్టార్ శర్వానంద్ అతిథిగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నటుడు చిన్నా మాట్లాడుతూ – ఈ సినిమాలో కెన్ స్నేహితుడిగా నటించాను. నా రియల్ లైఫ్ లో కూడా కెన్ నాకు మంచి మిత్రుడు కావడం గర్వంగా ఉంది. ఈ సినిమాకు మా టీమ్ ఎంత ప్యాషన్ గా వర్క్ చేసిందో, సందీప్, వినీత్ కూడా అంతే ప్యాషన్ తో తెలుగులోకి తీసుకొచ్చారు. వాళ్లు కూడా మా గ్యాంగ్ లో చేరారు అనుకుంటున్నాం. అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ మాట్లాడుతూ – కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా హిట్ చేస్తామని తెలుగు ఆడియెన్స్ ప్రూవ్ చేశారు. మీరు ఇప్పటిదాకా మీ ఫ్రెండ్స్ తో ఈ సినిమా చూసి ఉంటారు. ఈ సారి ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చూడండి. అన్నారు.

ప్రొడ్యూసర్ సందీప్ మాట్లాడుతూ – శర్వానంద్ అన్న తనకు మూవీ నచ్చితే గానీ గెస్ట్ గా వచ్చేందుకు ఒప్పుకోరు. ఆయనకు యూత్ మూవీ నచ్చింది. మమ్మల్ని అప్రిషియేట్ చేసేందుకు ఇక్కడికి వచ్చారు. అలాగే వశిష్ట గారు మొదటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. ధీరజ్ మొగిలినేని అన్న ఈ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. మేము యూత్ మూవీని తక్కువ టైమ్ లో ప్రమోట్ చేసి రిలీజ్ చేశాం. అయినా ఆడియెన్స్ సినిమాను ఆదరిస్తున్నారు. ఈవినింగ్ షోస్ నుంచి మూవీ పికప్ అవుతుంది అనుకుంటే మార్నింగ్ షోస్ నుంచే ప్రేక్షకులు బాగా థియేటర్స్ కు వెళ్తున్నారు. స్క్రీన్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. మా మార్కెటింగ్ సంస్థ పేరు హౌస్ ఫుల్. ఈ రోజు మేము ప్రొడ్యూస్ చేసిన సినిమాకు హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించడం సంతోషంగా ఉంది. పిల్లలు తమ తల్లిదండ్రుల్ని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని అర్థం చేసుకోవాలి అనే కాన్సెప్ట్ నచ్చే మేము ఈ మూవీ తెలుగులోకి తీసుకొచ్చాం. ఈ సినిమాను యూత్ తమ పేరెంట్స్ తో చూడాలి. అప్పుడే మా ప్రయత్నం విజయవంతమైందని అనుకుంటాం. తమ పేరెంట్స్ తో సినిమాకు వెళ్లే యూత్ ఫొటో తీసుకుని పంపిస్తే మొదటి 500 మందికి మేము టికెట్స్ ఇస్తాం. అన్నారు.

ప్రొడ్యూసర్ వినీత్ మాట్లాడుతూ – మా యూత్ మూవీకి శర్వానంద్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన రావడం వల్ల థియేటర్స్ కు వచ్చే ఫ్యామిలీ ఆడియెన్స్ సంఖ్య పెరుగుతుంది. మేము డిజిటల్ మార్కెటింగ్ మొదలుపెట్టాక, ఫుల్ వర్క్స్ లో పడి మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితోనూ ఎక్కువగా మాట్లాడలేకపోయేవాళ్లం. యూత్ సినిమా రిలీజ్ అయ్యాక మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా మళ్లీ టచ్ లోకి వచ్చారు. మన కాలేజ్ లో ఇలాగే జరిగింది కదా అని చెబుతున్నారు. మా సినిమాను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ, ఇక్కడ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ గా నిలిచిన వారందరికీ థ్యాంక్స్. అన్నారు.

హీరోయిన్ మీనాక్షి మాట్లాడుతూ – శర్వానంద్ గారి బైకర్ ట్రైలర్ మా అందరికీ బాగా నచ్చింది. ఈ సినిమా తెలుగు రిలీజ్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు మాపై ఆడియెన్స్ ఇంత లవ్ చూపిస్తారని అనుకోలేదు. థియేటర్స్ విజిట్ కు వెళ్లినప్పుడు ప్రేక్షకులు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం చూస్తుంటే సర్ ప్రైజింగ్ గా ఉంది. ప్రతి ఒక్కరు మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అన్నారు.

హీరోయిన్ ప్రియాన్షి యాదవ్ మాట్లాడుతూ – మా కెరీర్ లో ఇదొక మర్చిపోలేను రోజు. ఈ సక్సెస్ కోసమే మేము మొదటి రోజు నుంచి ఎదురుచూస్తూ వచ్చాం. తెలుగు ఆడియెన్స్ మా మూవీ మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మీ ఆదరణ చూస్తుంటే మరిన్ని మంచి చిత్రాలు చేయాలనే స్ఫూర్తి కలుగుతోంది. అన్నారు.

హీరో, డైరెక్టర్ కెన్ కరునాస్ మాట్లాడుతూ – శర్వానంద్ గారి బైకర్ మూవీ ట్రైలర్ బాగుంది. ఆ మూవీ రిలీజ్ కు ఇక్కడికి వచ్చి చూస్తాను. సందీప్, వినీత్ మా మూవీ కంటెంట్ ను నమ్మి తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగు ఆడియెన్స్ కంటెంట్ ముఖ్యమని మరోసారి ప్రూవ్ చేశారు. మాలాంటి కొత్త వాళ్ల సినిమాను కూడా థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. మా మూవీ మా దగ్గర సక్సెస్ కావడం సంతోషం, కానీ మరో రాష్ట్రంలో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసి సక్సెస్ కావడం ఇంకా సంతోషంగా ఉంది. ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రశంసలే మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. నేను ఈ సినిమాలో ప్రభాస్ గారి అభిమానిగా నటించాను. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా మా మూవీని సపోర్ట్ చేస్తున్నారు. మీరు మీ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ తోనే కాదు ఫ్యామిలీతో కూడా మా మూవీని చూడండి. అన్నారు.

డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – యూత్ సినిమాను థియేటర్స్ లో ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను చూస్తున్నారు. ఈ వీకెండ్ కు మరింత కలెక్షన్స్ పెరుగుతాయి. మేము ఆంధ్రలో ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేశాం. హౌస్ ఫుల్ సంస్థతో ఎన్నో చిత్రాలను ప్రమోట్ చేసిన సందీప్, వినీత్ ఈ చిత్రంతో నిర్మాతలకు మంచి ప్రయత్నం చేశారు. కెన్ అండ్ గ్యాంగ్ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకున్నారు. అన్నారు.

డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ – బైకర్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న శర్వానంద్ గారు ఈ ఈవెంట్ కు రావడం సంతోషంగా ఉంది. యూత్ సినిమా తమిళంలో ఈ నెల 19న రిలీజైంది. అక్కడ సూపర్ హిట్ టాక్ వచ్చింది. అక్కడ సినిమాకు సక్సెస్ టాక్ వచ్చినా మేము తెలుగు రిలీజ్ కోసం టెన్షన్ పడ్డాం. కానీ మూవీ రిలీజ్ అయ్యాక ఆ టెన్షన్ మొత్తం పోయింది. కెన్ అండ్ గ్యాంగ్ తమ పర్ ఫార్మెన్స్ లతో అందరినీ ఎంటర్ టైన్ చేస్తున్నారు. వీళ్లు మరో సినిమా త్వరగా చేసి ఆ మూవీ కూడా తెలుగు రిలీజ్ మాకే ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో శర్వానంద్ మాట్లాడుతూ – నేను చెన్నై వెళ్లినప్పుడు అక్కడ యూత్ మూవీ సూపర్ హిట్ అని తెలిసింది. తెలుగులో కూడా ఈ మూవీ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. వశిష్ట ఈ ఈవెంట్ కోసం కాల్ చేశారు. మా హౌస్ ఫుల్ సందీప్, వినీత్, సతీష్ ఈ మూవీని తెలుగులోకి తీసుకొచ్చారు. వాళ్లకు కంగ్రాట్స్ చెబుతున్నా. నేను చేసిన అనేక మూవీస్ కు వారు ప్రమోషన్స్ చేశారు. ప్రపంచంలో తెలుగు ఇండస్ట్రీ లాంటి గొప్ప ఇండస్ట్రీ, మనలాంటి గొప్ప ప్రేక్షకులు ఎక్కడా ఉండరు. మనం అన్ని భాషల మూవీస్ చూస్తాం, ఆదరిస్తాం. ఇతర భాషల హీరోలను తెచ్చుకుని ఇక్కడ మూవీస్ నిర్మిస్తున్నాం. మన ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు హ్యాట్సాఫ్. ఈ సినిమాను ఒక 23 ఏళ్ల అబ్బాయి డైరెక్ట్ చేసి హీరోగా నటించి హిట్ కొట్టాడంటే నమ్మలేకపోయాను. వాళ్లలో హానెస్టీ కనిపిస్తోంది. ఇంత చిన్న వయసులో ఇలాంటి మంచి మూవీ ఎలా చేశారో మీ దగ్గర నుంచే తెలుసుకుంటాను. నేను తమిళ మూవీస్ చేసినప్పుడు కూడా అక్కడ థియేటర్స్ లో ఇలాగే ఆడియెన్స్ ఎంజాయ్ చేయడం చూశాను. ఇలాంటి మంచి మూవీస్ మరిన్ని చేయండి. అన్నారు.

నటీనటులు – కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్, తదితరులు

టెక్నికల్ టీమ్
——————-
స్క్రిప్ట్, డైరెక్షన్ – కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్
బ్యానర్ – పారవతా ఎంటర్ టైన్ మెంట్స్
ప్రొడ్యూసర్ – కరుపయ్య సి.రామ్, సులోచన కుమార్
తెలుగు రిలీజ్ – ఈ2సీ టాకీస్ (హౌస్ పుల్ వినీత్, సందీప్)
మ్యూజిక్ – జీవీ ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ – వికి
ఎడిటర్ – నాష్
ఆర్ట్ డైరెక్టర్ – రాము తంగరాజ్
కాస్ట్యూమ్ డిజైనర్ – కావ్య శ్రీరామ్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – విజయ్ ఎంపీ
స్టంట్ – కలై కింగ్సన్
కొరియోగ్రఫీ – శోబి పాల్ రాజ్
సౌండ్ డిజైన్ – సింక్ సినిమా
సౌండ్ మిక్స్ – అర్వింద్ మీనన్
మార్కెటింగ్ – హౌస్ ఫుల్ డిజిటల్
పోస్టర్స్ – కబిలన్ చెల్లయ్య
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)