మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న రిలీజ్ కానున్న నేపథ్యంలో…
అడివి శేష్ ‘డెకాయిట్’ నుంచి ‘చిచ్చుబుడ్డి’ సాంగ్ రిలీజ్

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతున్న పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ప్రోమోలు, ఫస్ట్ సింగిల్ ‘రుబారూ’ ఒక రగ్గడ్ హీరోని ప్రజెంట్ చేశాయి. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా సెకండ్ సింగిల్ ‘చిచ్చుబుడ్డి’ని విడుదల చేశారు. ఇది శేష్ క్యారెక్టర్ సరికొత్త కోణాన్ని చూపిస్తోంది.
‘చిచ్చుబుడ్డి’ పాట సినిమా మూడ్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ఇందులో అడివి శేష్ తొలిసారిగా తెరపై డ్యాన్స్ చేస్తూ హై-ఎనర్జీ అవతార్‌లో అదరగొట్టారు.
సంగీత దర్శకుడు భీమ్స్ సెసిరోలియో ఫోక్ బీట్‌లతో కూడిన పార్టీ జానర్ పాట కంపోజ్ చేశారు.
భాస్కరభట్ల రవికుమార్ విజువల్ ఎక్స్ పీరియన్స్ కి సరిపోయే సరదా, ఆటపట్టించే సాహిత్యం అందించారు,
జోనితా గాంధీ తన ఎనర్జిటిక్ వోకల్స్ తో ఈ పాటకు పవర్ యాడ్ చేశారు. తన గ్లామరస్ డ్యాన్స్ తో తెరపై కూడా మెరిశారు. భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ ప్రత్యేక పాత్రలో కనిపించి, అందరినీ కట్టుకునే మాస్ వైబ్‌ను నింపారు.
భారీ, జనాలతో కూడినసెట్‌లో, కళ్లు చెదిరే కొరియోగ్రఫీతో చిత్రీకరించబడిన ‘చిచ్చుబుడ్డి’ ఒక వేడుకలా అనిపిస్తుంది.
ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తున్న ‘డెకాయిట్’ చిత్రంలో శేష్ సరసన మృణాల్ ఠాకూర్ నటించారు.
ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతుండగా, ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జ్ఞాని నేపథ్య సంగీతం సమకూర్చారు.
