Skip to content

“పళ్లిచట్టంబి” తెలుగులో బ్లాక్‌బస్టర్ అవుతుంది – చాణక్య, చైతన్య, చరణ్

“పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – చాణక్య, చైతన్య, చరణ్, మేఘ శ్యామ్ Telugu News

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ “పళ్లిచట్టంబి”. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణక్య, చైతన్య, చరణ్ నిర్మించారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే మలయాళంలో “పళ్లి చట్టంబి” సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. రేపు (ఈనెల 17న) తెలుగులో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్, అసోసియేట్ ప్రొడ్యూసర్ మేఘ శ్యామ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా
ప్రొడ్యూసర్ చైతన్య మాట్లాడుతూ – ఈ సినిమా కోసం మేము ఏడాదిన్నరగా కష్టపడ్డాం. చివరకు సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరంతా సినిమా చూశారు. మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. మలయాళంలో ఇప్పటికే ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. తెలుగు ఆడియెన్స్ కూడా అదే స్థాయి ఘన విజయాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
అసోసియేట్ ప్రొడ్యూసర్ మేఘ శ్యామ్ మాట్లాడుతూ- “పళ్లిచట్టంబి” సినిమాకు మన మీడియా మిత్రులు బాగా సపోర్ట్ చేశారు. మలయాళంలో ఈ మూవీ రిలీజై బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రతి ఒక్కరూ సినిమాను ఓన్ చేసుకుంటున్నారు. కారణం…ఇది తమ కథగా వాళ్లు భావిస్తున్నారు. తెలుగు ఆడియెన్స్ ముందుకు రేపు మా చిత్రాన్ని తీసుకొస్తున్నాం. బన్నీ వాస్ గారు మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. తెలుగులోనూ ఘన విజయం దక్కుతుందని ఆశిస్తున్నాం. ప్రొడ్యూసర్స్ చరణ్, చైతన్య, చాణక్య నాకు బ్రదర్స్ లాంటి వాళ్లు. వాళ్లకు సక్సెస్ రావాలి. మారుతి గారి వల్లే నేను మూవీస్ లోకి వచ్చాను. తెలుగులోనూ మంచి మూవీస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.
ప్రొడ్యూసర్ చరణ్ మాట్లాడుతూ – ఏడాదిన్నరగా “పళ్లిచట్టంబి” సినిమా కోసం కష్టపడ్డాం. 2వేల మంది ఈ మూవీ కోసం 130 రోజులు వర్క్ చేశారు. హీరో టొవినో థామస్, డైరెక్టర్ డిజో జోస్ చాలా సపోర్ట్ చేశారు. అనేక రకాల భావోద్వేగాలు మాలో కలుగుతున్నాయి. సినిమా ఎలా ఉంటుందో మేము చెబుతూ వచ్చాం. ఈ రోజు సినిమా మీరంతా చూశారు. మలయాళంలో మాసివ్ హిట్ అయ్యింది. తెలుగు ఆడియెన్స్ కూడా మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
ప్రొడ్యూసర్ చాణక్య మాట్లాడుతూ – మాకున్న ఈ చిన్న ఎక్సిపీరియన్స్ లో ఇలాంటి భారీ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉంది. మలయాళంలో పళ్లిచట్టంబి రిలీజై మంచి విజయం సాధించింది. ఫ్యామిలీ ఆడియెన్స్ పిల్లలతో కలిసి మూవీ చూస్తున్నారు. ఈ జర్నీలో నాకు నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారు. రేపు తెలుగులో మూవీ రిలీజ్ కు వస్తోంది. ఇక్కడ కూడా బిగ్ హిట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్స్ గా మరిన్ని మంచి మూవీస్ చేయాలని భావిస్తున్నాం. అన్నారు.
నటీనటులు – టొవినో థామస్, కయదు లోహర్, విజయరాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెక్జాండర్, తదితరులు
టెక్నికల్ టీమ్
————–
కాస్ట్యూమ్స్ – మంజూష రాధకృష్ణన్
మేకప్ – రషీద్ అహ్మద్
ప్రొడక్షన్ డిజైన్ – దిలీప్ నాథ్
ఎడిటింగ్ – శ్రీజిత్ సరంగ్
సినిమాటోగ్రఫీ – టిజో టోమీ
మ్యూజిక్ – జేక్స్ బిజోయ్
స్క్రిప్ట్ – ఎస్ సురేష్ బాబు
అసోసియేట్ ప్రొడ్యూసర్స్ – మేఘశ్యామ్, తంజీర్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – నౌఫల్, బ్రిజీష్, చాణక్య, చైతన్య, చరణ్
డైరెక్టర్ – డిజో జోస్ ఆంటోనీ

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.