Skip to content

‘రిచ్ కిడ్’ ఏప్రిల్ 23న విడుదల

‘రిచ్ కిడ్’ ఏప్రిల్ 23న  విడుదల Telugu News

శ్రీ మంజునాధ సినిమాస్ బ్యానర్ పై జి మంజునాద్ రెడ్డి నిర్మాతగా మరియు హీరోగా ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సినిమా రిచ్ కిడ్.
షఫీ ఉల్లాహ్ , అనిల్ దేరంగుల దర్శకత్వంలో వస్తోన్న రిచ్ కిడ్ సినిమా ఒక ఫాదర్ అండ్ సన్ ఏమోషన్ కథాంశంతో రూపొందించబచింది, ఇదివరకు తండ్రి కొడుకుల మధ్య నడిచే కథలతో చాలా సినిమాలు వచ్చినా వాటికి భిన్నంగా సరికొత్త స్క్రీన్ ప్లే తో రిచ్ కిడ్ సినిమా రాబోతోంది, ఎమోషన్స్ తో పాటు హస్యం, సంగీతం ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుంది, కుటుంభం మొత్తం కలిసి రిచ్ కిడ్ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు, డైరెక్టర్స్ షఫీ ఉల్లాహ్ , అనిల్ దేరంగుల ఈ సినిమాను తీర్చిదిద్దిన విధానం గొప్పగా ఉంటుంది, నిర్మాత మంజునాథ్ రెడ్డి సినిమాను ఎక్కడ రాజీ పడకుండా గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమాను నిర్మించారు.
హీరో గా మంజు హీరోయిన్ గా సుప్రియ మార్ల నటించిన ఈ సినిమాలో రాజశేఖర్ అనింగి, చెల్లి స్వప్న, సుమన్ శెట్టి, పింగ్ పాంగ్ సూర్య, బలగం సంజయ్, జబర్దస్త్ దుర్గా రావ్ తదితరులు నటించారు.
నిర్మాత : మంజునాథ్ రెడ్డి,
డైరెక్షర్స్ షఫీ ఉల్లాహ్ , అనిల్ దేరంగుల,
కథ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ : షఫీ ఉల్లాహ్ ,
కో డైరెక్టర్ : ఖాసీం గోటూరు, ఎడిటర్ : నవీన్ నంద్యాల, సంగీతం : శ్రీ వెంకట్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.