జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సహకారంతో తెరకెక్కుతున్న ‘ది ఇండియా స్టోరీ’…
అల్లు అర్జున్ సాంస్కృతిక ప్రభావం.. AA23 థీమ్ మ్యూజిక్‌ను ఉపయోగించిన ప్రధాని నరేంద్ర మోడి
సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ మొదలు కాకముందే..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశమంతటా పెద్ద స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన సినిమాలు, పాటలు, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ .. అన్నీ సరిహద్దులను దాటి ప్రేక్షకులను మెప్పించి వారి మనసుల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నాయి.
అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ ప్రధాని నరేంద్ర మోడి తన సోషల్ మీడియా పోస్టుల్లో ఒక దానిలో AA23 థీమ్ మ్యూజిక్‌ను ఉపయోగించటమే. ఇది అల్లు అర్జున్‌కు ఉన్న ప్రజాదరణ, సాంస్కృతిక ప్రాధాన్యతను తెలియజేస్తోంది.
AA23 ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ దాని థీమ్ మ్యూజిక్ ఇప్పటికే మెయిన్‌స్ట్రీమ్ చర్చల్లో చోటు దక్కించుకుంది. రాబోయే ప్రాజెక్ట్ నుంచి వచ్చిన కంటెంట్‌కే దేశవ్యాప్తంగా ఇంతటి ఆదరణ ఉండటమనేది చాలా అరుదైన విషయంగా పేర్కొనవచ్చు. చాలా సంవత్సరాలుగాఅల్లు అర్జున్ సక్సెస్‌ఫుల్ నటుడు మాత్రమే కాదు.. సరిహద్దులను దాటి రాణిస్తున్నారు. ఆయన సినిమాలు, అందులోని కంటెంట్ తరచుగా సాంస్కృతిక క్షణాలుగా మారుతూ భారతదేశం అంతటా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
AA23 మూవీ చుట్టూ రోజు రోజుకీ అభిమానులు, సినీ ఇండస్ట్రలో ఆసక్తి పెరుగుతోంది. ఇలాంటి సందర్భాలే అల్లు అర్జున్‌ని పాన్ ఇండియాస్టార్‌గా నిరూపిస్తున్నాయి. అలాగే సినిమా పరిమితులను దాటి విస్తరించిన ఆయన ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది.

