'ఫంకీ' చిత్రం ప్రతి ఒక్కరినీ విపరీతంగా నవ్విస్తుంది: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రేమికుల…
ఘనంగా పద్మశ్రీ డా.బ్రహ్మానందం 70వ పుట్టినరోజు వేడుకలు !!!

పద్మశ్రీ డా.బ్రహ్మానందం 70వ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా హైదరాబాద్ లో జరిగాయి. పేరమ్ గ్రూప్ మరియు శ్రీని ఇన్ఫ్రా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు డిప్యూటీ స్పీకర్ రఘురామమ కృష్ణంరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే నటులు బాబు మోహన్, ఎల్.బి.శ్రీరామ్, ఉత్తేజ్, పృథ్వి, బిత్తిరి సత్తి, ముక్కు అవినాష్, రఘు కుంచె, ఆర్పీ.పట్నాయక్, రఘుబాబు, రచ్చ రవి, ప్రగతి, ప్రభాస్ శ్రీను, సంపూర్ణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ… “42 ఏళ్ల సుదీర్ఘ నట ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంన్నానని అన్నారు, తాను నటుడిగా కొనసాగుతున్నాను అంటే అది తన గొప్పదనం కాదని ప్రేక్షకులదేనని అన్నారు.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు శాలువా తో ఆయన్న సన్మానించారు. ఎల్బీ శ్రీరామ్, బాబు మోహన్, ఉత్తేజ్, రఘుబాబు, సంపూర్ణేశ్ బాబు తదితరులు పాల్గొని ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు .
ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించిన బ్రహ్మానందం అనూహ్యంగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. సహజమైన హావభావాలు, హాస్య ప్రధానమైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఆయన్ని ఇతర కమెడియన్ల కంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ కలిపి 1250కి పైగా సినిమాల్లో నటించి, 2010లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారాయన. సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2009లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
వయస్సు పెరిగినా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ వేడుకలో స్పష్టంగా కనిపించింది. ‘తెలుగు సినిమా’ పేరు చెబితే ప్రపంచ వ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చే మొహం బ్రహ్మానందమే అన్న మాట మరోసారి నిజమైంది. తెరపై ఆయన కనిపిస్తే చాలు, ఒక్క డైలాగ్ లేకపోయినా థియేటర్లు నవ్వులతో మార్మోగుతాయి. నేటి సోషల్ మీడియా యుగంలోనూ మీమ్స్‌కు ఆయనే ప్రాణం కావడం బ్రహ్మీకి ఉన్న క్రేజ్‌కి నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ పుట్టినరోజు వేడుకల్లో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ప్రత్యేకంగా పాల్గొని శాలువాతో బ్రహ్మానందాన్ని సన్మానించారు. “బ్రహ్మానందంలో నేను కమెడియన్‌ను చూడలేదు… గొప్ప నటుడిని మాత్రమే చూశా. ఆయన్ని నిత్యం తలచుకోని తెలుగు వాడు ఉండడు” అంటూ ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ శ్రీరామ్, బాబు మోహన్, ఉత్తేజ్, రఘుబాబు, పృథ్వీరాజ్, రచ్చ రవి, సంపూర్ణేశ్ బాబు, ప్రగతి తదితర సినీ ప్రముఖులు పాల్గొని, బ్రహ్మానందంతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.


