*మిస్టర్ ఇండియా 2025 టైటిల్ గెలిచిన రాకేష్ ఆర్నె*
హైదరాబాద్: తెలంగాణకు చెందిన రాకేష్ ఆర్నె, మిస్టర్ ఇండియా 2025 టైటిల్‌ను గెలుచుకుని రాష్ట్రాన్ని గర్వపడేలా చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నవపేట మండలం ధర్పల్లి గ్రామానికి చెందిన యువకుడు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాకేష్ తన విజయ గాధను పంచుకున్నారు. ఈ సందర్భంగా రాకేష్ ఆర్నె మాట్లాడుతూ – "ఈ విజయానికి మూలకారణం నా నిరంతర కృషి, శ్రమ, కుటుంబం, మిత్రుల మద్దతు. మిస్టర్ ఇండియా పోటీలకు నేను నా ఫిట్‌నెస్, ఆత్మవిశ్వాసం, సోషల్ ఆవగాహనతో సన్నద్ధం అయ్యాను. ఇప్పుడు నా లక్ష్యం మిస్టర్ ఎలైట్ గ్లోబల్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం." ఈ పోటీలో రాకేష్ తన ప్రదర్శనలో సామాజిక సేవ, ఫిట్‌నెస్, అంతర్జాతీయ…