Skip to content

‘శ్రీనివాస మంగాపురం’ ప్రీ-లుక్ పోస్టర్ రిలీజ్

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు, జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా గ్రాండ్‌గా లాంచ్ అవుతున్నారు. RX 100, మంగళవారం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల విజనరీ ఫిల్మ్ మేకర్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ వెండితెర అరంగేట్రం చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్‌ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. టైమ్‌లెస్ కల్ట్‌ ప్రేమకథగా ఉండబోతే ఈ సినిమా టైటిల్‌ను అద్భుతమైన ప్రీ-లుక్ పోస్టర్ ద్వారా మేకర్స్ ఆవిష్కరించారు. ఈ చిత్రానికి 'శ్రీనివాస మంగాపురం' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. పోస్టర్ లో హీరో చేతులు, అతని లవర్…

Read more

“వానర” సినిమా అవినాశ్ కు మంచి పేరు తెస్తుంది – మంచు మనోజ్

అవినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. "వానర" చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న "వానర" సినిమా మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రాబోతోంది. వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. ఈ రోజు "వానర" సినిమా టీజర్ ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో క్రియేటివ్ డైరెక్టర్ జానకీరామ్ మాట్లాడుతూ - మా "వానర" సినిమా టీజర్…

Read more

‘అనగనగా ఒక రాజు’ చిత్రం నుంచి ‘భీమవరం బల్మా’ విడుదల

వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం 'అనగనగా ఒక రాజు'తో అలరించనున్నారు. ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా మొదటి గీతం విడుదలైంది. 'భీమవరం బల్మా' పేరుతో వచ్చిన ఈ పాట, కాస్త ముందుగానే పండుగ వాతావరణాన్ని తీసుకొని వచ్చింది. మాస్ ప్రేక్షకులతో పాటు, యువత మెచ్చేలా 'భీమవరం బల్మా' గీతం ఉంది. ఈ పాటతో మొదటిసారి గాయకుడిగా మారిన నవీన్‌ పొలిశెట్టి, తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నారు. వినోదాన్ని పంచడంలోనే కాదు, పాటను ఆలపించడంలోనూ దిట్ట అనిపించుకున్నారు. ఇక కథానాయిక మీనాక్షి చౌదరితో కలిసి ఈ…

Read more

“వానర” ఫస్ట్ లుక్ పోస్టర్

అవినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న "వానర" సినిమా సోషియో ఫాంటసీ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రాబోతోంది. "వానర" చిత్రాన్ని శంతను పతి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. ఈ రోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో అవినాశ్ బైక్ పై వెళ్తుండగా, ఆయనను రక్షణగా హనుమంతుడు వెంటే వెళ్తున్న స్టిల్ ఆసక్తి కలిగిస్తోంది. "వానర" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్…

Read more

నిజాయితీగా కష్టపడి సినిమా చేస్తే దేవుడు సక్సెస్ ఇస్తాడని “రాజు వెడ్స్ రాంబాయి” ప్రూవ్ చేసింది – శ్రీ విష్ణు

అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన "రాజు వెడ్స్ రాంబాయి" సినిమా ఘన విజయాన్ని దక్కించుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ఈ సినిమాకు ప్రశంసలు అందిస్తున్నారు. "రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని దక్కించుకున్న నేపథ్యంలో చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్ ను హైదరాబాద్ లో…

Read more

#NBK111 గ్రాండ్ గా లాంచ్

వరుస బ్లాక్‌బస్టర్‌ల దూసుకెళ్తున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, వీరసింహారెడ్డి సంచలన విజయం తర్వాత బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలిపారు. ఈ ఇద్దరి కొలాబరేషన్ లో హిస్టారికల్ ఎపిక్ #NBK111 చిత్రాన్ని ప్రతిష్టాత్మక వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. సింహ, జై సింహా, శ్రీ రామరాజ్యం తర్వాత బాలకృష్ణ, నయనతార కలిసి నటిస్తున్న నాల్గవ చిత్రం ఇది. ఈ ప్రాజెక్టు నేడు హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. బాలకృష్ణతో అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించిన దర్శకుడు బి గోపాల్…

Read more

రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్: కీర్తి సురేష్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ 'రివాల్వర్ రీటా'. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్ సుందరం & జగదీష్ పళనిసామి నిర్మించారు. రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ప్రెస్ మీట్లో హీరోయిన్ కీర్తి సురేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అజయ్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది…

Read more

‘పదహారు రోజుల పండుగ’- మూవీ గ్రాండ్ గా లాంచ్

వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, కేరింత వంటి విజయవంతమైన చిత్రాలని అందించిన డైరెక్టర్ సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం 'పదహారు రోజుల పండుగ'. సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతున్నారు. గోపిక ఉదయన్ హీరోయిన్. ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనసూయ భరద్వాజ్, వెన్నల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రదా పిక్చర్స్, సాయి సినీ చిత్ర బ్యానర్ పై ప్రొడక్షన్ నెం-1గా సురేష్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రం పూజాకార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ముహూర్తపు సన్నివేశానికి కోన వెంకట్, కేకే రాధా మోహన్ నిర్మాతలకి స్క్రిప్ట్ అందించారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల క్లాప్ కొట్టారు. నిర్మాత…

Read more

‘త్రికాల’ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి.. డిసెంబర్ లో గ్రాండ్ గా రిలీజ్

ప్రస్తుతం మైథలాజికల్ టచ్ ఉన్న పాయింట్‌తో వచ్చే చిత్రాలకు మంచి డిమాండ్ ఉంటోంది. ఆడియెన్స్ కూడా ఈ ఫిక్షనల్ జానర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మాతలుగా శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా ‘త్రికాల’ సినిమాను మణి తెల్లగూటి తెరకెక్కిస్తున్నారు. శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మాస్టర్ మహేంద్రన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్, నటుడు అజయ్ విశ్వరూపం, సినిమాలోని డైలాగ్స్, శ్రద్దా దాస్ మేకోవర్ అందరినీ ఆకట్టుకున్న…

Read more

సతీష్ నినాసం హీరోగా, నిర్మాతగా వస్తోన్న ‘ది రైజ్ ఆఫ్ అశోక’ నుంచి ‘వినరా మాదేవ’ పాట విడుదల

‘లూసియా’ ఫేమ్ సతీష్ నినాసం హీరోగా, నిర్మాతగా భారీ ఎత్తున రూపొందిస్తున్న చిత్రం ‘ది రైజ్ ఆఫ్ అశోక’. ఈ మూవీని వృద్ధి క్రియేషన్, సతీష్ పిక్చర్ హౌస్ బ్యానర్ల మీద వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నినాసం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు వినోద్ వి ధోండలే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సతీష్ నినాసంకి జోడిగా ‘కాంతార’, ‘తమ్ముడు’ ఫేమ్ సప్తమి గౌడ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ‘ది రైజ్ ఆఫ్ అశోక’ నుంచి ‘వినరా మాదేవ’ అంటూ సాగే జాతర పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలోని సాహిత్యం వింటే శివుడి గొప్పదనం మరోసారి అందరికీ అర్థమవుతుంది. ఆ…

Read more