4 రోజుల్లో 9.08 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను దక్కించుకున్న “రాజు వెడ్స్ రాంబాయి”
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన "రాజు వెడ్స్ రాంబాయి" సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని దక్కించుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ఈ సినిమాకు ప్రశంసలు అందిస్తున్నారు. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. 4 రోజుల్లో ఈ సినిమాకు 9.08 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఈ సినిమాకు రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మొదటి రోజు కంటే రెండో రోజు, రెండో రోజును మించిన వసూళ్లు మూడో రోజు, మూడో రోజును మించి నాలుగో రోజు ఈ చిత్రానికి కలెక్షన్లు దక్కాయి. వీక్ డేస్ లోనూ "రాజు వెడ్స్ రాంబాయి" బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ తో…
