‘బ్యూటీ’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న అంకిత్ కొయ్యకి మెగా బ్లెస్సింగ్స్
మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ కూడా యంగ్ జనరేషన్‌తో ముచ్చట్లు పెట్టేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. యంగ్ హీరోలు, మేకర్లతో చిరంజీవి ఎక్కువగా సంభాషిస్తుంటారు. యంగ్ టాలెంట్ రావాలని, కొత్త రక్తం, కొత్త నీరు ఇండస్ట్రీలో ప్రవహించాలని చిరంజీవి ప్రతీ చోటా చెబుతుంటారు. అలాంటి చిరంజీవి తాజాగా యంగ్ సెన్సేషన్ అంకిత్ కొయ్యను మనస్పూర్తిగా ఆశీర్వదించారు. ‘బ్యూటీ’ అంటూ సెప్టెంబర్ 19న అంకిత్ కొయ్య ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. అంకిత్ కొయ్య ‘ఆయ్’, ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ అంటూ అందరినీ నవ్వించి మంచి విజయాల్ని సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఓ అందమైన ప్రేమ కథతో, కుటుంబ సమేతంగా చూడదగ్గ ఓ ‘బ్యూటీ’ ఫుల్ చిత్రంతో అందరి ముందుకు రాబోతోన్నారు. సెప్టెంబర్ 19న అంకిత్ కొయ్య నటించిన…
