#Mega 157 మూడవ షెడ్యూల్ కేరళలో పూర్తి
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి మోస్ట్ అవైటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ #Mega157 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. తాజాగా యూనిట్ కేరళలో మూడవ షెడ్యూల్ పూర్తి చేసింది. ఈ షెడ్యూల్ లో బ్యూటీఫుల్ సాంగ్ తో పాటు కీలకమైన టాకీ పోర్షన్స్ ని షూట్ చేశారు. సాంగ్, సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. మూడవ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి ప్రైవేట్ జెట్ ముందు నిలబడి చిరునవ్వుతో కనిపించిన ఫోటోని మేకర్స్ షేర్ చేశారు. ఇటీవల రిలీజ్…
