ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ యూ ఇన్-షిక్
న్యూఢిల్లీలోని కొరియా రిపబ్లిక్ రాయబార కార్యాలయం, కొరియన్ ఫిల్మ్ కౌన్సిల్ భాగస్వామ్యంతో, హైదరాబాద్‌లోని కొరియా గౌరవ కాన్సులేట్ జనరల్ మూడవ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను లాంచ్ చేసింది. ఈ కార్యక్రమం 2025 డిసెంబర్ 1న, బంజారా హిల్స్‌లోని ఎల్.వి. ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో జరిగింది. అన్ని వయస్సుల వారికి ఉచిత ప్రవేశం కలిగిన ఈ వేడుకలో వివిధ జానర్లకు చెందిన ఆకట్టుకునే కొరియన్ సినిమాలను ప్రదర్శించారు. అలాగే, సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన స్టాల్స్‌లో ఫేస్ పెయింటింగ్, హాంబోక్ ట్రైయల్స్, కొరియన్ కాలిగ్రఫీ, కొరియన్ నాట్స్, థీమ్ ఫోటో జోన్లతో కొరియన్ సంస్కృతిని ఎక్స్ పీరియన్స్ చేసే ప్రత్యేక ఆకర్షణలు వున్నాయి. ఈ ఏడాది ఫెస్టివల్‌కు మరింత ప్రత్యేకత ఉంది. ప్రముఖ…
