Skip to content

జేడీ చక్రవర్తి లీడ్‌గా ‘‘చేతబడి”

జేడీ చక్రవర్తి లీడ్‌గా  ‘‘చేతబడి” Telugu News
జేడీ చక్రవర్తి లీడ్‌గా  ‘‘చేతబడి” Telugu News

వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రానికి ‘‘చేతబడి” అనే టైటిల్‌ను రివీల్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు M3 Media మరియు Maha Movies సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహర్షి కూండ్ల ప్రెజెంట్స్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి సూర్యాస్ రచన, దర్శకత్వం వహిస్తుండగా, మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాటోగ్రఫీ మిర్లాన్ నసీర్, ఎడిటింగ్ వంశీ నిర్వహిస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ ఆసక్తికరమైన చిత్రం హారర్, మిస్టరీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్‌‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. గురువారం వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి పుట్టినరోజు సందర్భంగా ఇందులో ఆయన పోషిస్తున్న పాత్ర గురించి రివీల్ చేశారు మేకర్స్. మునుపెన్నడూ పోషించని డిఫరెంట్ అవతార్‌‌లో హీరోగా, విలన్‌గా జేడీ చక్రవర్తి కనిపించనున్నారని చిత్ర యూనిట్ తెలియజేసింది. మరోవైపు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాకముందే.. ఐదు భాషల ఆడియో రైట్స్‌ను మ్యూజిక్ సెన్సేషన్ సరిగమ సంస్థ దక్కించుకుంది. ఒక పాటను ఐదు భాషల్లో విడుదల చేయడం కామన్‌గా జరుగుతుంది. కానీ ఇందులో తెలుగులో ఒక పాట, మిగిలిన భాషల్లో డిఫరెంట్ సాంగ్స్‌, సేమ్ విజువల్‌తో రావడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వచ్చే నెలనుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమా టెక్నికల్‌గా కూడా హై స్టాండర్డ్స్‌లో ఉండబోతోందని యూనిట్ చెబుతోంది.

చిత్రం : చేతబడి
నటుడు : జేడీ చక్రవర్తి
బ్యానర్ : M3 Media, Maha Movies
సమర్పణ : మహర్షి కూండ్ల
నిర్మాత: మహేంద్రనాథ్ కూండ్ల
కథ, దర్శకత్వం : సూర్యాస్
సంగీతం : అచ్చు రాజమణి
లిరిక్స్ : ఆస్కార్ విన్నర్ చంద్రబోస్
సినిమాటోగ్రాఫర్ : మిర్లాన్ నజీర్
ఎడిటర్ : వంశీ
ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ పూలల
పిఆర్‌ఓ: జీకే మీడియా (గణేష్ – కుమార్)