ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ టాలెంటెడ్…
ఆశా భోంస్లే మరణం పట్ల చిరంజీవి సంతాపం


దిగ్గజ గాయని ఆశా భోంస్లే కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆశా భోంస్లే మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు.
“ఆశా భోంస్లే గారి స్వరం తరతరాల పాటు అనేక రకాల భావోద్వేగాలను పలికిస్తూ, భారతీయ సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచింది. ప్రతి పాటలో ఆమె చూపించిన సహజమైన నైపుణ్యం, వైవిధ్యం నాకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయి.
భారతీయ చిత్ర పరిశ్రమ భర్తీ చేయలేని ఒక స్వరాన్ని కోల్పోయింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
