Skip to content
ఆశా భోంస్లే మరణం పట్ల  చిరంజీవి సంతాపం Telugu News

ఆశా భోంస్లే మరణం పట్ల చిరంజీవి సంతాపం

దిగ్గజ గాయని ఆశా భోంస్లే కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆశా భోంస్లే మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. “ఆశా భోంస్లే గారి స్వరం తరతరాల పాటు అనేక రకాల భావోద్వేగాలను పలికిస్తూ, భారతీయ సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచింది. ప్రతి పాటలో ఆమె చూపించిన సహజమైన నైపుణ్యం, వైవిధ్యం నాకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. భారతీయ చిత్ర పరిశ్రమ భర్తీ చేయలేని ఒక స్వరాన్ని కోల్పోయింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

Read more
ఆశా  భోస్లే  గారి ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్‌ కల్యాణ్‌ Telugu News

ఆశా భోంస్లే గారి ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్‌ కల్యాణ్‌

ప్రముఖ గాయని శ్రీమతి ఆశా భోంస్లే గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆశాజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సుదీర్ఘ కాలం హిందీతోపాటు మరాఠీ, తెలుగు, బెంగాలీ వంటి భాషల్లో సినీ గీతాలు ఆలపించిన మధుర గాయని ఆమె. పాశ్చాత్య సంగీత శైలి గీతాలను సైతం ఆలపించి ఒక తరం యువతను ఉర్రూతలూగించారు. దమ్ మారో దమ్, చురా లియా హై తుమ్నే, ఇన్ అంకో కి మస్తీ, రాధా కైసే న జలే… లాంటి గీతాలతో సినీ, సంగీతాభిమానులను అలరించారు. తెలుగులో ఆశాజీ పాడిన గీతాలు తక్కువే అయినా హిందీ గీతాలతో తెలుగు రాష్ట్రాల్లో చిరపరిచితమే. శ్రీమతి ఆశా భోస్లే గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. (పవన్…

Read more