మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో వచ్చిన ‘బిచ్చగాడు’ చిత్రం ఎన్ని రికార్డుల్ని…
‘డైమండ్ డెకాయిట్’ ఆడియో రిలీజ్

▪️పాటలు విడుదల చేసిన వీఎన్ ఆదిత్య
▪️ చిత్రంలోని పాటకు హుక్ స్టెప్ వేసిన వారికి ₹ లక్ష బహుమతి ప్రకటన
హైదరాబాద్:
తెలుగు తెరపై సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఎమోషనల్ రివెంజ్ డ్రామా ‘డైమండ్ డెకాయిట్’. పార్ధ గోపాల్ నిర్మాణంలో, దర్శకుడు సూర్య జి యాదవ్ దర్శకత్వంలో, పార్ధ గోపాల్ – మేఘన జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రముఖ మ్యూజిక్ సంస్థ మధుర ఆడియో ద్వారా ఈ పాటలను ముఖ్య అతిథిగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య పాల్గొని విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ వినూత్న పోటీకి తెర లేపింది. ఈ చిత్రంలోని “మరదలివే” పాటకు హుక్ స్టెప్ ఛాలెంజ్ ను ప్రకటించింది. ఆసక్తిగల వారు వారు ఆ పాటకు తమ హుక్ స్టెప్‌తో రీల్స్ రూపొందించి, ఆ రీల్స్ లింక్‌ను 8074801661 వాట్సాప్ నంబర్‌కు పంపవచ్చు.
అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి:
మొదటి బహుమతి – ₹1,00,000
రెండవ బహుమతి – ₹50,000
కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించదానికి ఈ ఛాలెంజ్ ను ప్రకటించామని చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ సందర్భంగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ.. “సినిమా పాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. పెద్దపల్లి రోహిత్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. పాటలు, ట్రైలర్ చూసి ఆ రిచ్ నెస్‌కు పడిపోయాను. దర్శకుడు కొత్త అయినప్పటికీ బాగా చేశాడు. పార్ధ గోపాల్ తనపై తాను బడ్జెట్ పెట్టుకునే స్థితి నుంచి తనపై పెద్ద ప్రొడ్యూసర్లు పెట్టుబడి పెట్టేంత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. చిత్రయూనిట్ సభ్యులందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నారు. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందనే నమ్మకం ఉంది. చిత్ర యూనిట్ మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అన్నారు.
చిత్ర నిర్మాత, హీరో పార్ధ గోపాల్ మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా సినిమా ఆడియోను వి.ఎన్. ఆదిత్య గారి చేతుల మీదుగా విడుదల చేయించడం ఎంతో ఆనందంగా ఉంది. మా సినిమాకు కర్త, కర్మ, క్రియ అయిన దర్శకుడికి కృతజ్ఞతలు. దర్శకుడు సూర్య జి. యాదవ్ గత మూడున్నరేళ్లుగా ఎన్నో కష్టాలు, ఎత్తుపల్లాలు ఎదుర్కొంటూ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన పాటలకు కూడా ప్రశంసలు వస్తున్నాయి. ‘డైమండ్ డెకాయిట్’ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ రివెంజ్ డ్రామా. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం” అని తెలిపారు.
దర్శకుడు సూర్య జి. యాదవ్ మాట్లాడుతూ.. “మా వేడుక ముఖ్య అతిథి వి.ఎన్. ఆదిత్య గారికి ధన్యవాదాలు. సినిమాలోని పూర్తి లిరీక్ సాంగ్‌ను కూడా విడుదల చేశాం. 5 పాటలు, మ్యూజిక్ నిజంగా అద్భుతంగా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ మా సినిమాకు అదృష్టం. పెద్ద సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా బీజీఏం కూడా బాగా ఇచ్చారు. కెమెరా, నటీనటులు, మిగతా చిత్రబృందం బాగా చేయడం వల్లే సినిమా బాగా వచ్చింది. దర్శకత్వం నిర్వహణలో మా హీరో, నిర్మాత పార్ధ గోపాల్ గారు పూర్తి సపోర్టు ఇచ్చారు. ఎక్కడా రాజీ పడకుండా నిర్మాణం చేస్తున్నారు . సినిమా ఫ్యామిలీ ఎమోషన్, రివెంజ్ డ్రామా మేళవింపుతో ఉంటుంది. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చాయి. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాం” అన్నారు.
హీరోయిన్ మేఘన మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం మా టీమ్ మొత్తం ఎంతో కష్టపడి పనిచేశాం. ముఖ్యంగా దర్శకుడు సూర్య జి. యాదవ్ గారు, హీరో- నిర్మాత పార్ధ గోపాల్ గారి సహకారం ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది. సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది” అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ పెద్దపల్లి రోహిత్ మాట్లాడుతూ.. “ఇటీవల చిన్న చిత్రాల్లో మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ‘డైమండ్ డెకాయిట్’ కూడా అదే కోవకు చెందిన చిత్రం. లవ్ సాంగ్, టైటిల్ సాంగ్ సహా అన్ని పాటలు చాలా బాగా వచ్చాయి. పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.
నటీనటులు:
పార్ధ గోపాల్ (హీరో ), మేఘన (హీరోయిన్ )
నిర్మాత: పార్ధ గోపాల్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సూర్య జి. యాదవ్
మ్యూజిక్ డైరెక్టర్: పెద్దపల్లి రోహిత్
ఎడిటర్: శ్రీనివాస్
DOP: ఆచంట శివ
మార్కెటింగ్ అడ్వైజర్ : తాడి గోవింద్
పీఆర్ఓ: అశోక్ దయ్యాల
