Skip to content

ప్రేక్షకులకు థ్రిల్ ని పంచిన ఎర్ర చీర

హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో మదర్ సెంటిమెంట్‌ను ప్రధానంగా తీసుకుని రూపొందిన తాజా తెలుగు చిత్రం ఎర్రచీర – ది బిగినింగ్. ఈ రోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, భిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను భయంతో పాటు భావోద్వేగాలకు కూడా దగ్గర చేస్తుంది.

కథ ఏమిటంటే…
దాసు (సుమన్ బాబు) అవంతిక (కారుణ్య చౌదరి)ను ప్రేమించి వివాహం చేసుకుంటాడు. ఆస్తి కోసం దాసు అమ్మమ్మ పన్నీ పార్వతిని అవంతిక హత్య చేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత అవంతిక ఒక పాపాత్మగా మారి, తన చనిపోయిన తల్లిని వెతుకుతూ భయంకర రూపంలో తిరుగుతుంది.
ఇదే సమయంలో ట్రాన్స్‌ఫర్‌పై శ్వేతా సిటీకి వస్తున్న పోలీస్ ఆఫీసర్ శివకుమార్ (కమల్ కామరాజు) భార్యకు, ఎర్రచీరలో కనిపించే అవంతిక తన మరణించిన తల్లిలా అనిపిస్తుంది. ఈ అతీంద్రియ సంఘటనల వెనుక అసలు కారణం ఏమిటి? శివశక్తితో ప్రసిద్ధుడైన సరిపోక త్రికోటేశ్వరస్వామి (సుమన్ బాబు మరో కీలక పాత్రలో) ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తాడు? అన్నదే కథ.

నటీనటుల ప్రతిభ
సుమన్ బాబు దర్శకుడిగా మాత్రమే కాదు, నటుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. ద్విపాత్ర ఛాయలతో ఆకట్టుకుంటారు. త‌న పాత్ర‌తో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తాడు. త‌న న‌ట‌న‌తో పాత్ర‌లో లీన‌మై ఈ సినిమాకు ప్రాణం పోశాడు.
కమల్ కామరాజు పోలీస్ పాత్రలో సీరియస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
కారుణ్య చౌదరి అవంతిక పాత్రలో హారర్ ఎలిమెంట్‌ను బలంగా పండించారు.
ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో భావోద్వేగాలకు ప్రాణం పోశారు.
ఆలీ, అన్నపూర్ణమ్మ, గీతా సింగ్, సత్యకృష్ణన్, భద్రం, జీవా, రఘుబాబు వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక అంశాలు
హారర్‌కు తగ్గ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, చీకటి షేడ్స్‌తో కూడిన సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలాలు. మదర్ సెంటిమెంట్ సన్నివేశాలు భావోద్వేగంగా పండాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ప్రత్యేకంగా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

విశ్లేషణ
డైరెక్ట‌ర్ సుమన్ బాబు చింతల్ ప్రాంతంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా కొన్ని సీన్లు తెరకెక్కించారు. తాను రాసుకున్న క‌థ‌లోని సన్నివేశాలు సినిమాను ఎంతో ఎత్తులో నిల‌బెడ‌తాయి. క‌థ‌ను ఎంతో అద్భుతంగా తెర కెక్కించిన తీరు చూస్తే డైరెక్ట‌ర్ సుమ‌న్ బాబుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఇది లేడీ ఓరియెంటెడ్ చిత్రమే అయినా, కుటుంబమంతా కలిసి చూసేలా హారర్‌ను మితంగా చూపించడం విశేషం. కథలో కొత్తదనం, మదర్ సెంటిమెంట్‌కు హారర్, యాక్షన్ అంశాల మేళవింపు సినిమాను ఆసక్తికరంగా నిలబెట్టాయి. ప్రేక్ష‌కుల‌ను ఉత్కంఠ‌కు గురి చేస్తుంది. అదే ప్రేక్ష‌కుల‌ను మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో హార్ట్ ట‌చ్ చేస్తుంది.

భయపెట్టే హారర్‌తో పాటు తల్లిపట్ల ఉన్న అనుబంధాన్ని హృదయానికి తాకేలా చెప్పిన సినిమా ‘ఎర్రచీర – ది బిగినింగ్’. డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మంచి ఎంపిక.

రేటింగ్ 3.5/5