‘ఇరుముడి’ కి నేషనల్ అవార్డ్స్ వస్తాయి: జీవీ ప్రకాష్ కుమార్
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇరుముడి సినిమాకి మ్యూజిక్ చేయడం మీకు ఎంత ప్రత్యేకంగా అనిపించింది? -నేను ప్రేమ కథలు, కమర్షియల్ సినిమాలు చాలా చేశాను. ఇరుముడి మాత్రం చాలా ఇంటెన్స్ థ్రిల్లర్. దర్శకుడు శివ నిర్వాణ గారు కథ…
