Skip to content

కాటాలన్ ఫస్ట్ సింగిల్ మజాకో మల్లికా రిలీజ్

  • MOVIES
  • Vishwanath
కాటాలన్ ఫస్ట్ సింగిల్ మజాకో మల్లికా రిలీజ్ Telugu News

క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ కాటాలన్ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. పుష్ప, జైలర్ వంటి చిత్రాల ద్వారా ఇప్పటికే మలయాళీ ప్రేక్షకులకు సుపరిచితుడైన తెలుగు స్టార్ సునీల్ ఈ ట్రాక్ లో అదరగొట్టారు. ఐటెం నంబర్‌గా వహ్చిన ఈ పాటలో సునీల్ హై-ఎనర్జీ డ్యాన్స్ మూమెంట్స్ హైలైట్ గా నిలిచాయి. బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచిన *“మజాకో మల్లికా అనే ట్రాక్‌ను వినాయక్ శశికుమార్ రాశారు. ఆనంద్ శ్రీరాజ్, భద్ర పాడారు. ఇది మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో విడుదలైంది.

కాటాలన్ మే 14న భారీ పాన్-ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది. బ్లాక్‌బస్టర్ మార్కో మేకర్స్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది, అద్భుతమైన యాక్షన్ సన్నివేశా, ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్టంట్ సన్నివేశాలు అలరించాయి.

ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు, దుషార విజయన్, కబీర్ దుహాన్ సింగ్, పుష్ప ఫేమ్ రాజ్ తరందాసు, బాలీవుడ్ నటుడు పార్థ్ తివారీ, మలయాళ నటులు జగదీష్, సిద్ధిక్, వ్లాగర్-గాయకుడు హనన్ షా, రాపర్ బేబీ జీన్, హిప్స్టర్ వంటి భారీ తారాగణం ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఓంగ్-బాక్ సిరీస్‌కు ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయంగా ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ తన బృందంతో కలిసి థాయిలాండ్‌లో యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేశారు. ఓంగ్-బాక్ చిత్రాల ద్వారా ప్రజాదరణ పొందిన ప్రసిద్ధ ఏనుగు “పాంగ్” కూడా ఈ చిత్రంలో భాగమైయింది.

కాంతారా, మహారాజా వంటి బ్లాక్‌బస్టర్‌లతో పాన్-ఇండియన్ ఖ్యాతిని పొందిన సంగీత దర్శకుడు బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నిర్మాణం పూర్తి కాకముందే, ఈ చిత్రం అనేక ప్రీ-రిలీజ్ రికార్డులను బద్దలు కొట్టిందని, మలయాళ సినిమాల్లో అతిపెద్ద ఓవర్సీస్ డీల్స్‌లో ఒకటిగా నిలిచింది. T-సిరీస్ మ్యూజిక్ హక్కులను సొంతం చేసుకోగా, షెమరూ డిజిటల్, శాటిలైట్ పంపిణీని నిర్వహిస్తుంది.

కాటాలన్ ను పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా భారీ స్థాయిలో నిర్మించారు. స్క్రిప్ట్‌ను జాబీ వర్గీస్, పాల్ జార్జ్ , జెరో జాకబ్ రాశారు, సంభాషణలు ఉన్ని ఆర్. ఈ చిత్రం మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది.

ఈ బృందంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జుమానా షరీఫ్, అడిషినల్ సినిమాటోగ్రాఫర్ రెనాదివ్, సినిమాటోగ్రాఫర్ చంద్రు సెల్వరాజ్, ఎడిటర్ షమీర్ ముహమ్మద్, స్టంట్ డైరెక్టర్లు కేచా ఖంఫక్డీ , యాక్షన్ సంతోష్, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ దాస్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ దిపిల్ దేవ్, ప్రొడక్షన్ కంట్రోలర్ దీపక్ పరమేశ్వరన్, ఆడియోగ్రాఫర్ రాజకృష్ణన్ ఎం ఆర్, సౌండ్ డిజైనర్లు కిషన్ , సప్త రికార్డ్స్, కాస్ట్యూమ్ డిజైనర్ ధన్య బాలకృష్ణన్, మేకప్ ఆర్టిస్ట్ రోనాక్స్ జేవియర్, లిరిసిస్ట్ సుహైల్ కోయా, స్టిల్ ఫోటోగ్రాఫర్ అమల్ సి సదర్, కొరియోగ్రాఫర్ షరీఫ్ , VFX స్టూడియో 3 డోర్స్.

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.