మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో…
దర్శకుడు సుధీర్ అత్తవర్‌కు ‘కొరగజ్జ’ నిర్మాత త్రివిక్రమ సాపల్య కాస్ట్ లీ గిఫ్ట్..
సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహించిన ‘కొరగజ్జ’ చిత్రం గత జనవరిలోనే విడుదలకు కావాల్సింది. జీ మ్యూజిక్ బ్యానర్‌పై ఘనంగా ఆడియో లాంచ్ కూడా జరిగింది. అయితే చివరి నిమిషంలో ఈ చిత్రాన్ని త్రీడీలోకి మారుస్తున్నట్లు ప్రకటించి, విడుదలను వాయిదా వేశారు. ప్రస్తుతం కొచ్చి, చెన్నైలో త్రీడీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సాంకేతికంగా ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయికి దీటుగా రూపుదిద్దుకుంటోంది అని దర్శకుడు సుధీర్ అత్తవర్ అన్నారు
అంతర్జాతీయ పంపిణీ సంస్థల నుండి పెరుగుతున్న డిమాండ్, ఆసక్తిని చూసి నిర్మాత త్రివిక్రమ సాపల్య సంతోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం గత మూడేళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేసిన దర్శకుడు సుధీర్ అత్తవర్‌కు శోభా డెవలపర్స్ వారిచే నిర్మించబడిన సుమారు ₹1.75 కోట్ల మార్కెట్ విలువ గల లగ్జరీ త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్‌ను నిర్మాత బహుమతిగా ఇచ్చారు.
ఇప్పటికే ఆరు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇప్పుడు అస్సామీ, చైనీస్, ఆంగ్ల వెర్షన్లు కూడా రెడీ అవుతున్నాయి. శుక్రవారం నాడు ఈ నూతన గృహ ప్రవేశ వేడుక జరిగింది. అనంతరం శ్రీ సత్యనారాయణ వ్రతం చేశారు. ఆదివారం నాడు జర్నలిస్టులు, అతిథుల సమక్షంలో, బెంగళూరులో చాలా అరుదైన ‘అగేలు సేవ’ కార్యక్రమాన్ని కొరగజ్జ దైవ కోసం నిర్వహించారు.
ప్రముఖ నటి భవ్య, కొరగజ్జ దైవ ‘అగేలు సేవ’కు ఎంతో ఇష్టమైన వంటకాలను సమర్పించారు. కుచలక్కి అన్నం, ఉలవలు-బసలే సాంబార్, మాకేరెల్ చేపల కూర, లేత మామిడి ఊరగాయ, చికెన్ సుక్కా, కల్లు, ఇంకా మరెన్నో వంటకాలను ఒక గెరసాలో అమర్చి అందించారు. దర్శకుడి భార్య రాజశ్రీ సుధీర్ ఈ వంటకాలన్నింటినీ తయారు చేయగా, నిర్మాత త్రివిక్రమ సాపల్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత విద్యాధర్ శెట్టి భవ్యకు సహకరించారు.
ఈ మేరకు నటి భవ్య మాట్లాడుతూ.. ‘‘కొరగజ్జ’ సినిమా దైవం పట్ల నా భక్తిని మరింత పెంచింది. నేను సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నాను. చిత్ర బృందంతో నాకు విడదీయలేని బంధం ఏర్పడింది. ఈ సినిమాలో కొరగజ్జకు మొట్ట మొదటిసారిగా ‘అగేలు సేవ’ చేసే ‘రాణి పంజనదాయి’ పాత్రను నేను పోషించాను. ఇప్పుడు నిజ జీవితంలో దర్శకుడి నూతన గృహ ప్రవేశ వేడుకలో కోరగజ్జకు ‘అగేలు సేవ’ చేసే అదృష్టాన్ని నాకు ఇచ్చారు. ఇక ఇంత కంటే అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండకపోవచ్చు’ అని అన్నారు.
నిర్మాత త్రివిక్రమ సాపల్య మాట్లాడుతూ.. ‘‘కొరగజ్జ’ చిత్రాన్నిచైనీస్ వంటి విదేశాల్లో విడుదల చేయడానికి హాంకాంగ్, బీజింగ్, ఇతర ప్రాంతాల నుంచి అంతర్జాతీయ పంపిణీ సంస్థలు ముందుకు వస్తున్నాయి. సినిమా బడ్జెట్ ₹40 కోట్లు దాటింది. అయినప్పటికీ విశ్వాసం, ఆనందం అంతకంతకూ పెరుగుతూనే వచ్చాయి. దీనికి గుర్తుగానే గత మూడేళ్లుగా ఈ సినిమాపై పనిచేసిన దర్శకుడికి ఈ ఫ్లాట్‌ను బహుమతిగా ఇస్తున్నాను’ అని అన్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎగ్జిక్యూటివ్ నిర్మాత, ఎడిటర్ విద్యాధర్ శెట్టి తెలిపారు.

