Skip to content

కంప్లీట్ ట్రాన్సఫర్మేషన్, న్యూ లుక్ తో టాలీవుడ్ కు తిరిగి వస్తున్న యంగ్ టాలెంటెడ్ హీరో మహత్ రాఘవేంద్ర

కంప్లీట్ ట్రాన్సఫర్మేషన్, న్యూ లుక్ తో టాలీవుడ్ కు తిరిగి వస్తున్న యంగ్ టాలెంటెడ్ హీరో మహత్ రాఘవేంద్ర Telugu News

బ్యాక్ బెంచ్ స్టూడెంట్, లేడీస్ అండ్ జెంటిల్ మేన్ వంటి హిట్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ లో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో మహత్ రాఘవేంద్ర. మంగాత, జిల్లా, చెన్నై 28 పార్ట్ 2 వంటి పలు సక్సెస్ ఫుల్ తమిళ చిత్రాలతో పాటు డబుల్ ఎక్స్ ఎల్ వంటి బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి పేరు తెచ్చుకున్నారీ యంగ్ టాలెంటెడ్ హీరో. మహత్ రాఘవేంద్ర ఇప్పుడు తిరిగి టాలీవుడ్ కు రాబోతున్నారు. కంప్లీట్ బాడీ ట్రాన్సఫర్మేషన్, న్యూ లుక్ తో మహత్ రాఘవేంద్ర ఆకట్టుకుంటున్నారు.

హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ తో మహత్ రాఘవేంద్ర ఓ ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు తిరిగి రావడం హ్యాపీగా ఉందని మహత్ రాఘవేంద్ర తెలిపారు. తనను ఇప్పటిదాకా ఆదరించిన తెలుగు ప్రేక్షకులు మరోసారి తమ లవ్ అండ్ సపోర్ట్ అందిస్తారని ఆయన ఆశిస్తున్నారు. టాలీవుడ్ రీ ఎంట్రీ పట్ల ఎగ్జైటింగ్ గా ఉన్నానని, ఇది తన కెరీర్ కు కొత్త ఛాప్టర్ అవుతుందని మహత్ రాఘవేంద్ర చెప్పారు.

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.