Skip to content

శ్రీకాంత్ చేతుల మీదుగా ‘మారణహోమం 1990s’ టీజర్ విడుదల

శ్రీకాంత్ చేతుల మీదుగా ‘మారణహోమం 1990s’ టీజర్ విడుదల Telugu News

ఎన్.కె.ఎస్. ఫిలిమ్స్ పతాకంపై సమన్విత ప్రెసెంట్స్ లో బంధు నరేష్ దర్శకత్వంలో బంధు నాగమణి నిర్మిస్తున్న చిత్రం ‘మారణహోమం 1990s’. ఈ చిత్ర టీజర్ మరియు ఫస్ట్ లుక్ ప్రముఖ నటుడు శ్రీకాంత్ చేతుల మీదుగా ఘనంగా చేసారు. టీజర్ చూసిన శ్రీకాంత్ చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ, సినిమా విజయంపై ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రముఖ హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. “మారణహోమం 1990s టీజర్ చాలా అద్భుతంగా ఉంది. దర్శకుడు మంచి స్టైల్ లో, బలమైన కంటెంట్ ఉన్న కథను ఎంచుకున్నారు. మేకింగ్ విజువల్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. చిత్ర హీరో హీరోయిన్లు మరియు ఇతర నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. తప్పకుండా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను” అని చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

చిత్ర హీరో బంధు నరేష్ మాట్లాడుతూ… ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ‘1990s’ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 1990ల నేపథ్యంలో సాగే ఈ కథలో బలమైన ఎమోషన్స్ మరియు యాక్షన్ సీన్స్ ఉంటాయి. మంచి బిజినెస్ జరిగి, సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్ర హీరో బంధు నరేష్, హీరోయిన్ బంధు నాగమణి, దీప్తి రెడ్డి లౌక్య, భాను, ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్స్ పివి రెడ్డి, శ్యామ్ సుందర్, వట్టం. రవి, ఎ. కిరణ్, ఎ. నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ : బంధు నరేష్, ప్రొడ్యూసర్ : బంధు నాగమణి, సంగీతం : నవనీత్ చారి, ఆర్మన్, డిఓపి : రాఘవేందర్ రెడ్డి (రఘు). మేనేజర్ : హేమంత్, పిఆర్ఓ : బాబు నాయక్.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.