Skip to content

ఘనంగా ‘M4M’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా   ‘M4M’ ప్రీ రిలీజ్ వేడుక Telugu News
ఘనంగా   ‘M4M’ ప్రీ రిలీజ్ వేడుక Telugu News

అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. PVR Inox Pictures ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తెలుగు సినీ దర్శకుల సంఘం (TFDA) అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, సీనియర్ డైరెక్టర్ వి. సముద్ర హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా దర్శకుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఈ వేడుక జరగడం ప్రత్యేకతగా నిలిచింది.

TFDA) అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ:
మోహన్ వడ్లపట్ల తన టీమ్‌తో కలిసి గొప్ప టాలెంట్‌ను తెరపై ప్రదర్శించారని ప్రశంసించారు. జో శర్మకు మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు.

దర్శకుడు, TFDA Vice President వి సముద్ర మాట్లాడుతూ:
మే 8న విడుదల కానున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు. మోహన్ వడ్లపట్ల గొప్ప దర్శకుడిగా ఎదగాలని కోరుకున్నారు.

TFDA సెక్రటరీ పెండ్యాల మాట్లాడుతూ:
M4M ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉందని, సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ కొత్తగా ఉందని చెప్పారు. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు.
నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ:
సినిమా 24 శాఖలను సమన్వయం చేస్తూ రూపొందించారని, టీమ్ ఎంతో కష్టపడి పనిచేసిందని తెలిపారు. కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నారు.

హీరోయిన్ Jo Sharma మాట్లాడుతూ:
ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దర్శకుడు మోహన్ వడ్లపట్లకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా నుంచి వచ్చి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పారు. ఇప్పటికే ఈ చిత్రానికి 25 దేశాల్లో 50కి పైగా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయని వెల్లడించారు. ప్రేక్షకులు సినిమాను చూసి హిట్ చేయాలని కోరారు.

దర్శక-నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ:
సినిమాలోని సీరియల్ కిల్లర్ ఎవరో చెప్పిన వారికి లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ ప్రకటించినట్లు తెలిపారు. M4M యూనివర్సల్ సబ్జెక్ట్ అని, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పారు. ఈ సినిమా ద్వారా ఒక కొత్త సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతున్నామని పేర్కొన్నారు.

నటుడు MRC వడ్లపట్ల మాట్లాడుతూ:
మోహన్ వడ్లపట్ల మంచి టీమ్‌తో మంచి సినిమా తీశారని, హీరోయిన్ జో శర్మ ఈ సినిమాకు ప్రధాన బలం అని చెప్పారు.

మొత్తానికి, ఆసక్తికరమైన కథాంశం, కొత్త కాన్సెప్ట్‌తో M4M చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.

బ్యానర్‌: మోహన్ మీడియా క్రియేషన్స్
సహకారం: McWin Group USA
న‌టీన‌టులు: జో శర్మ, సంబీత్ ఆచార్య, త‌దిత‌రులు.
ద‌ర్శ‌క‌త్వం, నిర్మాణం: మోహన్ వడ్లపట్ల
పీఆర్ఓ: ప‌ర్వ‌త‌నేని రాంబాబు, క‌డ‌లి రాంబాబు, అశోక్ ద‌య్యాల‌

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.